యూఏఈలో కొనసాగుతున్న కరోనా విలయం!

ABN , First Publish Date - 2020-10-24T12:42:13+05:30 IST

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. యూఏఈలో కూడా ఈ మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకీ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం రోజు దేశ వ్యాప్తంగా 1.20ల

యూఏఈలో కొనసాగుతున్న కరోనా విలయం!

అబుధాబి: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. యూఏఈలో కూడా ఈ మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకీ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం రోజు దేశ వ్యాప్తంగా 1.20లక్షల కరోనా టెస్టులు నిర్వహించగా.. 1,563 మంది కొవిడ్ బారినపడ్డట్లు తేలిందని యూఏఈ ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో 1,704 మంది మహమ్మారి నుంచి కోలుకోగా.. కరోనా కాటుకు ఒకరు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. అంతేకాకుండా ఇప్పటి వరకు యూఏఈ వ్యాప్తంగా నిర్వహించి కొవిడ్ టెస్టుల సంఖ్య 1.20కోట్లకు చేరిందని వెల్లడించారు. అంతర్జాతీయ ప్రయాణాలపై విధించిన ఆంక్షలు క్రమంగా సడలించిన నేపథ్యంలో యూఏఈలోకి ప్రవేశిస్తున్న విదేశీయుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో అక్టోబర్ 6 నుంచి ప్రతిరోజు వెయ్యికిపైగా కరోనా కేసులు నమోదవున్నాయి. కాగా.. కరోనా కట్టడికి ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని అక్కడి అధికారులు ప్రజలకు కోరారు. ఇదిలా ఉంటే.. యూఏఈలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1.22లక్షలు దాటింది. ఇందులో 1.15లక్షల మంది కోలుకోగా 475 మంది ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం 6,730 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

Updated Date - 2020-10-24T12:42:13+05:30 IST