యూఏఈలో 246 కొత్త కేసులు.. 232 రిక‌వ‌రీలు

ABN , First Publish Date - 2020-08-13T16:23:35+05:30 IST

కోవిడ్-19 ప్ర‌భావం నుంచి యూఏఈ కోలుకుంటోంది. పాజిటివ్ కేసులు త‌గ్గ‌డంతో పాటు రిక‌వ‌రీలు అంత‌కంత‌కు పెరుగుతున్నాయి.

యూఏఈలో 246 కొత్త కేసులు.. 232 రిక‌వ‌రీలు

యూఏఈ: కోవిడ్-19 ప్ర‌భావం నుంచి యూఏఈ కోలుకుంటోంది. పాజిటివ్ కేసులు త‌గ్గ‌డంతో పాటు రిక‌వ‌రీలు అంత‌కంత‌కు పెరుగుతున్నాయి. బుధ‌వారం 246 కొత్త కేసులు న‌మోదైతే... 232 రిక‌వ‌రీలు న‌మోదైన‌ట్లు ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డ్డ వారి సంఖ్య‌ 63,212కు చేరితే... మొత్తం కోలుకున్న‌వారి సంఖ్య 57,193కు చేరింది. అలాగే ఇప్ప‌టికే 358 మందిని ఈ వైర‌స్ పొట్ట‌న‌బెట్టుకుంది. ప్ర‌స్తుతం దేశంలో 5,661 యాక్టివ్ కేసులు ఉన్నాయి.


మ‌రోవైపు ఈ వైర‌స్‌ క‌ట్ట‌డికి యూఏఈ ముమ్మ‌రంగా క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 5.6 మిలియ‌న్ల కోవిడ్ టెస్టులు పూర్తి చేసింది. ఇలా విరివిగా క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం వ‌ల్లే ఈ మ‌హ‌మ్మారి అదుపులోకి వ‌చ్చినట్లు ఆరోగ్య‌శాఖ అధికారులు తెలిపారు. దీంతో రిక‌వ‌రీ రేటు 92 శాతంగా ఉన్న‌ట్లు పేర్కొన్నారు.  ‌ 


Updated Date - 2020-08-13T16:23:35+05:30 IST