యూఏఈలో శరవేగంగా విస్తరిస్తున్న కరోనా..!

ABN , First Publish Date - 2020-05-29T04:11:03+05:30 IST

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. యూఏఈలోని ఈ మహమ్మారి శరవేగంగా విస్తోరిస్తోంది. కాగా.. గురువారం ఒక్కరోజే యూఏఈలో 563 కరోనా కే

యూఏఈలో శరవేగంగా విస్తరిస్తున్న కరోనా..!

యూఏఈ: కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. యూఏఈలోని ఈ మహమ్మారి శరవేగంగా విస్తోరిస్తోంది. కాగా.. గురువారం ఒక్కరోజే యూఏఈలో 563 కరోనా కేసులు నమోదైనట్లు యూఏఈ ఆరోగ్య మంత్రిత్వ‌శాఖ ప్రకటనలో వెల్లడించింది. అంతేకాకుండా 314 మంది కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వగా.. ముగ్గురు చనిపోయినట్లు ప్రకటనలో పేర్కొంది. ఈ రోజు కొత్తగా నమోదైన కేసులతో కలిపి.. యూఏఈలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 32,532కు చేరినట్లు తెలిపింది. ఇందులో 16,685 మంది కరోనా నుంచి కోలుకున్నారని వివరించింది. అంతేకాకుండా రికవరీ రేటు 51.29 శాతం ఉన్నట్లు యూఏఈ ఆరోగ్య మంత్రిత్వ‌శాఖ స్పష్టం చేసింది. కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలని కోరింది. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించడంతోపాటు భౌతిక దూరాన్ని పాటించాలని ప్రజలకు సూచించింది. ఇదిలా ఉంటే.. యూఏఈలో ఇప్పటి వరకు కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 258కి చేరింది. 


Updated Date - 2020-05-29T04:11:03+05:30 IST