క‌రోనా కోర‌ల్లో చిక్కుకుని యూఏఈ విల‌విల‌...

ABN , First Publish Date - 2020-05-30T16:27:27+05:30 IST

ప్ర‌పంచ దేశాల‌ను వ‌ణికిస్తున్న క‌రోనా.. అటు గ‌ల్ఫ్‌లో కూడా విరుచుకుప‌డుతోంది.

క‌రోనా కోర‌ల్లో చిక్కుకుని యూఏఈ విల‌విల‌...

యూఏఈ: ప్ర‌పంచ దేశాల‌ను వ‌ణికిస్తున్న క‌రోనా.. అటు గ‌ల్ఫ్‌లో కూడా విరుచుకుప‌డుతోంది. ముఖ్యంగా సౌదీ అరేబియా, ఖ‌తార్‌, కువైట్‌, యూఏఈలో ఈ వైర‌స్ ప్ర‌భావం తీవ్రంగా ఉంది. యూఏఈలో ఈ మ‌హ‌మ్మారి రోజురోజుకీ విజృంభిస్తోంది. శుక్ర‌వారం కూడా 638 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు దేశ వ్యాప్తంగా కోవిడ్ సోకిన వారి సంఖ్య‌ 33,170కి చేరింది. అలాగే నిన్న ఒకేరోజు 412 మంది కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు యూఏఈలో కోలుకున్న వారు 17,097 మంది అయ్యారు. శుక్ర‌వారం సంభ‌వించిన రెండు మ‌ర‌ణాల‌తో క‌లిపి దేశ‌వ్యాప్తంగా మృతుల సంఖ్య 260కి చేరింది. ప్ర‌స్తుతం 15,813 మంది బాధితులు వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.


మ‌రోవైపు క‌రోనా క‌ట్ట‌డికి యూఏఈ క‌ఠిన చ‌ర్య‌లు చేప‌డుతోంది. దేశ‌వ్యాప్తంగా ముమ్మ‌రంగా కోవిడ్ టెస్టులు నిర్వ‌హిస్తోంది. శుక్ర‌వారం కూడా 36,000 క‌రోనా టెస్టులు నిర్వ‌హించిన యూఏఈ... ఇప్ప‌టివ‌ర‌కూ దేశవ్యాప్తంగా రెండు మిలియ‌న్‌కు పైగా మంది కోవిడ్ ప‌రీక్ష‌లు చేసింది. ఇదిలాఉంటే... ‌పంచ‌వ్యాప్తంగా శ‌ర‌వేగంగా విస్త‌రిస్తున్న‌‌ ఈ వైర‌స్ ఇప్ప‌టికే  3.66 ల‌క్ష‌ల‌ మందిని పొట్ట‌నుబెట్టుకుంది. 60.30 ల‌క్ష‌ల‌ మంది బాధితులు ఉన్నారు.     

Updated Date - 2020-05-30T16:27:27+05:30 IST