యూఏఈలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు!

ABN , First Publish Date - 2020-06-01T16:05:44+05:30 IST

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. యూఏఈలోనూ కొవిడ్ కేసులు రోజురోజుకీ పెరగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే యూ

యూఏఈలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు!

యూఏఈ: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. యూఏఈలోనూ కొవిడ్ కేసులు రోజురోజుకీ పెరగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే యూఏఈ వ్యాప్తంగా 661 కేసులు నమోదైనట్లు వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. 386 మంది కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా.. ఇద్దరు మృతి చెందారని వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో యూఏఈ వ్యాప్తంగా 37వేల కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు పేర్కొంది. ఇదిలా ఉంటే.. అబుధాబిలో ప్రభుత్వ కార్యాలయాలు తెరుచోకున్నట్లు యూఏఈ ప్రభుత్వం ప్రకటించింది. 35శాతం ఉద్యోగులతో ప్రభుత్వ కార్యాలయాలు పని చేస్తాయని స్పష్టం చేసింది. కరోనా కట్టడికి ప్రజలు జాగ్రత్తలు పాటించాలని పేర్కొంది. అంతేకాకుండా అల్ హస్న్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని ప్రజలకు సూచించింది. కాగా.. యూఏఈలో ఇప్పటి వరకు 34వేల మందికి పైగా కరోనా బారినపడగా.. ఇందులో దాదాపు 18వేల మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. మృతి చెందిన వారి సంఖ్య 264గా ఉంది. 


Updated Date - 2020-06-01T16:05:44+05:30 IST