భార‌త్‌లో చిక్కుకున్న యూఏఈ రెసిడెంట్స్‌కు తీపి క‌బురు

ABN , First Publish Date - 2020-07-10T16:02:19+05:30 IST

క‌రోనా లాక్‌డౌన్ కార‌ణంగా భార‌త్‌లో చిక్కుకుపోయిన యూఏఈ నివాసితుల‌కు కేంద్రం తీపి క‌బురు అందించింది.

భార‌త్‌లో చిక్కుకున్న యూఏఈ రెసిడెంట్స్‌కు తీపి క‌బురు

న్యూఢిల్లీ: క‌రోనా లాక్‌డౌన్ కార‌ణంగా భార‌త్‌లో చిక్కుకుపోయిన యూఏఈ నివాసితుల‌కు కేంద్రం తీపి క‌బురు అందించింది. 'వందే భారత్ మిష‌న్'‌లో భాగంగా 15 రోజుల పాటు ఇండియా నుంచి యూఏఈకి ప్ర‌త్యేక విమాన స‌ర్వీసులు న‌డ‌ప‌నున్న‌ట్లు భారత పౌర విమానయాన అధికారులు ప్ర‌క‌టించారు. ఈ నెల 12 నుంచి 26 వ‌ర‌కు ఈ విమానాలు న‌డ‌వ‌నున్నాయి. ఈ మేరకు ఇరు దేశాల పౌర విమానయాన శాఖల మ‌ధ్య ఒప్పందం కుదిరింది. దీంతో వందలాది మంది భారతీయుల దీర్ఘకాల నిరీక్షణకు తెర ప‌డింది.‌


ఇక కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టడానికి యూఏఈ, భారతదేశం రెండూ తమ గగనతలాలను మూసివేశాయి. దీంతో మార్చి నుంచి చాలా మంది భార‌త్‌లో చిక్కుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే భార‌తీయుల‌ను యూఏఈ తీసుకెళ్లేందుకు ఆ దేశ క్యారియ‌ర్ల‌కు సంబంధించిన చార్ట‌ర్డ్ విమానాల‌కు ఐసీఏ ఆమోదించిన‌ట్లు భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కాగా, ప్రస్తుత కార్యాచరణ కాలం తర్వాత ఈ స‌ర్వీసుల‌ను అవసరమైన విధంగా సమీక్షిస్తామని భారత అధికారులు తెలిపారు. ఇక యూఏఈలో చిక్కుకున్న ఎన్నారైల‌ను కేంద్రం 'వందే భార‌త్ మిష‌న్' ద్వారా స్వ‌దేశానికి త‌ర‌లిస్తున్న విష‌యం తెలిసిందే. 



Updated Date - 2020-07-10T16:02:19+05:30 IST