యూఏఈలో ఆరు నెలల వీసా.. అర్హులు ఎవరంటే..

ABN , First Publish Date - 2021-04-03T14:51:26+05:30 IST

గోల్డెన్ రెసిడెన్సీ దరఖాస్తుదారుల కోసం యూఏఈ ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజెన్షిప్ ఆరు నెలల గడువుతో వీసా సర్వీసును తీసుకొచ్చింది.

యూఏఈలో ఆరు నెలల వీసా.. అర్హులు ఎవరంటే..

దుబాయ్: గోల్డెన్ రెసిడెన్సీ దరఖాస్తుదారుల కోసం యూఏఈ ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజెన్షిప్ ఆరు నెలల గడువుతో వీసా సర్వీసును తీసుకొచ్చింది. ఈ వీసా మల్టీపుల్ ఎంట్రీకి కూడా వీలు కల్పిస్తుంది. గోల్డెన్ రెసిడెన్సీకి సంబంధించిన అన్ని విధానాలను పూర్తి చేయడానికి వీలు కల్పించే ఉద్దేశంతో యూఏఈ ఈ 6 నెలల వీసా సేవకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ఇది చాలాసార్లు ప్రయాణించే వారికి ప్రయోజనం చేకూరుస్తుంది. ఇక ఈ వీసా ఖరీదును 1150 దిర్హమ్స్(సుమారు రూ.23వేలు)గా అథారిటీ నిర్ణయించింది. కేవలం గోల్డెన్ రెసిడెన్సీ విధానాన్ని పూర్తి చేసే కారణంతో తీసుకొచ్చిన ఆరు నెలల వీసాకు ఎవరు అర్హులంటే..

1. ప్రభుత్వ పెట్టుబడులు లేదా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడిదారులు

2. వ్యవస్థాపకులు

3. వైద్యులు, శాస్త్రవేత్తలు

4. ఆవిష్కర్తలు

5. పీహెచ్‌డీ హోల్డర్స్

6. అథ్లెట్స్

7. సంస్కృతి, కళలో సృజనాత్మక నిపుణులు

8. ప్రాధాన్యత గల శాస్త్రీయ రంగాలలోని నిపుణులు

9. ఇంజనీరింగ్, సైన్స్ నిపుణులు (ఎపిడెమియాలజీ మరియు వైరస్‌లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా, కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్స్, ప్రోగ్రామింగ్, ఎలక్ట్రికల్, జెనెటిక్స్, బయోటెక్నాలజీ)

10. అత్యుత్తమ విద్యార్థులు (ఉన్నత పాఠశాల లేదా విశ్వవిద్యాలయం)


* దరఖాస్తు: ఐసీఏ వెబ్‌సైట్- https://smartservices.ica.gov.ae




Updated Date - 2021-04-03T14:51:26+05:30 IST