‘Schools తెరుచుకుంటున్నాయి జాగ్రత్త..’ వాహనదారులకు UAE హెచ్చరిక

ABN , First Publish Date - 2021-08-28T15:06:40+05:30 IST

యూఏఈలో ఆదివారం నుంచి పాఠశాలలు తెరుచుకోబోతున్నాయి. ఈ క్రమంలోనే అక్కడి ప్రభుత్వం ట్రాఫిక్ రూల్స్‌పై దృష్టిసారించింది. స్కూల్స్ తెరుచుకోవడంతో రోడ్లపై వాహనాల రాకపోకలు గణనీయంగా పెరుగుతాయని, దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు పెరుగుతాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ప్రధానంగా పాఠశాలలు..

‘Schools తెరుచుకుంటున్నాయి జాగ్రత్త..’ వాహనదారులకు UAE హెచ్చరిక

అబుదాబి: యూఏఈలో ఆదివారం నుంచి పాఠశాలలు తెరుచుకోబోతున్నాయి. ఈ క్రమంలోనే అక్కడి ప్రభుత్వం ట్రాఫిక్ రూల్స్‌పై దృష్టిసారించింది. స్కూల్స్ తెరుచుకోవడంతో రోడ్లపై వాహనాల రాకపోకలు గణనీయంగా పెరుగుతాయని, దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు పెరుగుతాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ప్రధానంగా పాఠశాలలు తెరుచుకున్న మొదటి రోజు ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతుందని, ఫలితంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని దుబాయ్ అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ ప్రమాదాలను అరికట్టేందుకు దుబాయ్ పోలీసులు ప్రత్యేకంగా ఓ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ‘ఏ డే వితౌట్ యాక్సిడెంట్స్(ప్రమాదాలు లేకుండా ఓ రోజు)’ అనే కార్యక్రమం ద్వారా వాహనదారులకు అవగాహన కల్పించేందుకు సిద్ధమయ్యారు.



దుబాయ్ పోలీసుల అంచనా ప్రకారం.. దాదాపు 1.14 మిలియన్ల(11లక్షల 40 వేల) మంది స్కూళ్లకు వెళ్లే అవకాశం ఉంది. రోడ్లపై వాహనాల రద్దీ విపరీతంగా పెరగుతుందని, తద్వారా వాహన ప్రమాదాలకు దారితీస్తుందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మోటార్ వాహనాలు నడిపే వారు రోడ్డు భద్రతా నియమాలు కచ్చితంగా పాటించాలని సూచిస్తున్నారు. 

Updated Date - 2021-08-28T15:06:40+05:30 IST