ఉదయనిధి విజయంపై హైకోర్టులో పిటిషన్‌

ABN , First Publish Date - 2021-09-18T14:27:19+05:30 IST

స్థానిక చేపాక్కం-ట్రిప్లికేన్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉదయనిధి గెలుపు చెల్లదని ప్రకటించాలంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చేపాక్కం-ట్రిప్లికేన్‌ నియోజకవర్గంలో

ఉదయనిధి విజయంపై హైకోర్టులో పిటిషన్‌

పెరంబూర్‌(చెన్నై): స్థానిక చేపాక్కం-ట్రిప్లికేన్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉదయనిధి గెలుపు చెల్లదని ప్రకటించాలంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చేపాక్కం-ట్రిప్లికేన్‌ నియోజకవర్గంలో డీఎంకే తరఫున పోటీచేసిన ఉదయనిధి సమీప పీఎంకే అభ్యర్ధిపై 69,355 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. ఈ నేపథ్యంలో, ఆ నియోజకవర్గంలో పోటీచేసిన దేశీయ మక్కల్‌ కట్చి అభ్యర్ధి, న్యాయవాది ఎంఎల్‌ రవి మద్రాసు హైకోర్టులో దాఖలుచేసిన పిటిషన్‌లో, ఉదయనిధి దాఖలుచేసిన నామినేషన్‌ పత్రాల్లో తనపై ఉన్న కేసుల వివరాలు సక్రమంగా పేర్కొనలేదని, అందువల్ల ఆయన నామినేషన్‌ చెల్లదని పేర్కొనాలని పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌ను శుక్రవారం విచారించిన న్యాయమూర్తి భారతిదాసన్‌, ఈ వ్యవహారంలో ఎన్నికల కమిషన్‌, ఉదయనిధి రెండు వారాల్లో కౌంటర్‌ అఫిడివిట్‌ దాఖలుచేయాలని నోటీసు జారీచేసి, తదుపరి విచారణ అక్టోబరు 1వ తేదీకి వాయిదావేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

Updated Date - 2021-09-18T14:27:19+05:30 IST