ఉద్ధవ్ థాకరే సంచలన నిర్ణయం

ABN , First Publish Date - 2021-09-07T01:04:28+05:30 IST

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సంచలన నిర్ణయం తీసుకున్నారు. అన్నిసామాజిక, మత, రాజకీయ సమావేశాలను ..

ఉద్ధవ్ థాకరే సంచలన నిర్ణయం

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సంచలన నిర్ణయం తీసుకున్నారు. అన్నిసామాజిక, మత, రాజకీయ సమావేశాలను రద్దు చేస్తూ ఆదేశాలిచ్చారు. జనసమీకరణల కారణంగా రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరిగే అవకాశాలు బలంగా ఉన్నాయంటూ నిపుణులు సూచించిన నేపథ్యంలో థాకరే సర్కార్ తాజా నిర్ణయం తీసుకుంది. ప్రజల ఆరోగ్యానికే ప్రథమ ప్రాధాన్యమని, వేడుకలు తరవాతనైనా జరుపుకోవచ్చని ఉద్ధవ్ థాకరే పేర్కొన్నారు. ''మనం పండుగలు తరువాత చేసుకుందా. ప్రజలు ప్రాణాలు, ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యం ఇద్దాం. రోజువారీ కేసులు పెరుగుతుండటంతో పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఉంది'' అని ఉద్దవ్ హెచ్చరించారు.


సోమవారంనాడు జరిగిన 'డిజాస్టర్ మేనేజిమెంట్' సమావేశంలో థాకరేతో పాటు సీనియర్ మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా థాకరే మాట్లాడుతూ, పండుగలు, మతపరమైన కార్యక్రమాలపై ఆంక్షలు విధించడానికి ఎవరు మాత్రం ఇష్టపడతారు? అయితే ప్రజల ప్రాణాలు చాలా ముఖ్యం'' అని అన్నారు. దీనికి ముందు వర్చువల్‌గా జరిగిన మహా డాక్టర్ కాన్ఫరెన్స్‌ ప్రారంభోపన్యాసంలో సీఎం మాట్లాడుతూ, ఆలయాలు,  సంస్థలు, ప్రదేశాలు తెరవాలని ప్రజలు నిరసన తెలపవద్దని కోరారు. కొందరు తమ వ్యాపార సంస్థలు తెరవాలని తొందరపడుతున్నారని, అయితే వారిని వేచిచూడాలని తాము కోరుతున్నామని, ఒకవేళ తెరిచినా పరిస్థితి విషమిస్తే తిరిగి మూసివేయక తప్పదని అన్నారు. కాగా, థర్డ్ వేవ్‌ కనుక వస్తే 60 లక్షల కేసులు నమోదయ్యే అవకాశాలున్నాయని ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ టోపె హెచ్చరించారు. మొదటి వేవ్‌లో 20 లక్షల కేసులు, రెండో వేవ్‌లో 40 లక్షల కేసులు చూశామని, థర్డ్ వేవ్‌ వచ్చిన పక్షంలో సునామీ తరహాలో 60 లక్షలకు కేసులు చేరే అవకాశాలున్నాయని అన్నారు.

Updated Date - 2021-09-07T01:04:28+05:30 IST