ఉద్దానంలో కనిపించని సంక్రాంతి సందడి

ABN , First Publish Date - 2021-01-13T05:26:17+05:30 IST

ఉద్దానంలో సంక్రాంతి సందడి కనిపించడం లేదు. ఒక పక్క కరోనా, మరో పక్క వరుస తుఫాన్లు వెరసి ఉద్దానాన్ని పండగకు దూరం చేశాయి. ఒకప్పుడు సంక్రాంతికి 15 రోజుల ముందు నుంచే ఉద్దానం గ్రామాల్లో సందడి ప్రారంభమయ్యేది. సెలవులకు ఇంటికి వచ్చే పిల్లలతో పాటు దూరప్రాంతాల నుంచి వచ్చే బంధువులతో గ్రామాలు కళకళలాడేవి. అందరూ కలిసి ఒక చోటకు చేరి సంతోషంగా గడిపేవారు. ప్రస్తుతం ఈ పరిస్థితి ఉద్దానంలో కానరావడం లేదు.

ఉద్దానంలో కనిపించని  సంక్రాంతి సందడి
పితృదేవతలను పొగుడుతున్న సిద్ధేశులు (ఫైల్‌)

కవిటి: ఉద్దానంలో సంక్రాంతి సందడి కనిపించడం లేదు. ఒక పక్క కరోనా, మరో పక్క వరుస తుఫాన్లు వెరసి ఉద్దానాన్ని పండగకు దూరం చేశాయి. ఒకప్పుడు సంక్రాంతికి 15 రోజుల ముందు నుంచే ఉద్దానం గ్రామాల్లో సందడి ప్రారంభమయ్యేది. సెలవులకు ఇంటికి వచ్చే పిల్లలతో పాటు దూరప్రాంతాల నుంచి వచ్చే బంధువులతో గ్రామాలు కళకళలాడేవి. అందరూ కలిసి ఒక చోటకు చేరి సంతోషంగా గడిపేవారు. ప్రస్తుతం ఈ పరిస్థితి ఉద్దానంలో కానరావడం లేదు. రెండేళ్ల కిందట వచ్చిన తితలీ తుఫాను ఈ ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. పెథాయ్‌, తదితర తుఫాన్లు రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. గత అక్టోబరులో వచ్చిన వరదలు మరింత కుంగదీశాయి. అలాగే, కరోనా సృష్టించిన విలయతాం డవం అందరికీ తెలిసిందే. ఈ ఏడాది రైతులంతా సంక్రాంతిని జరుపుకొనేందుకు అంతగా ఉత్సాహం చూపడంలేదు. ఇదిలా ఉండగా, పరిస్థితులకు తగ్గట్టుగా రానురాను సంప్రదాయాలు కూడా కనుమరుగైపోతున్నాయి. గంగిరెడ్ల ఆటలు, బుడబుక్కల వారి సందడి, హరిదాసులు, సిద్ధేశుల పిల్లలు సైతం తమ వృత్తులను విడిచిపెట్టి వేరే మార్గాలు చూసుకుంటున్నారు. కుటుంబాలను పోషించే ఆదాయం లేక వలసపోతున్నారు. అనాదిగా వస్తున్న ఆచారాలను విడిచిపెట్టి ఇతర ఆదాయ మార్గాలను చూసుకుంటున్నారు.

 

 

Updated Date - 2021-01-13T05:26:17+05:30 IST