యూట్యూబ్‌ చానల్‌లో ఉద్యాన సమాచారం : వీసీ

ABN , First Publish Date - 2020-10-30T04:36:40+05:30 IST

డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ హెచ్‌యూ–ఫార్మర్స్‌ అడ్వయి జరీ సెల్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో ఎలక్ర్టానిక్‌ విభాగం ద్వారా రూపొందించిన వీడి యోలు రైతులకు అందుబాటులో ఉంటాయని వీసీ జానకిరామ్‌ గురువారం తెలి పారు.

యూట్యూబ్‌ చానల్‌లో ఉద్యాన సమాచారం : వీసీ

తాడేపల్లిగూడెం, అక్టోబరు 29 : డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ హెచ్‌యూ–ఫార్మర్స్‌ అడ్వయి జరీ సెల్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో ఎలక్ర్టానిక్‌ విభాగం ద్వారా రూపొందించిన వీడి యోలు రైతులకు అందుబాటులో ఉంటాయని వీసీ జానకిరామ్‌ గురువారం తెలి పారు. వెంకట్రామన్నగూడెం డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ విశ్వవిద్యాలయం మ్యూజియంలో గురువారం ఎలక్ర్టానిక్‌ విభాగాన్ని ప్రారంభించి మాట్లాడారు. నాబార్డు, భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి సహకారంతో అఽధునాతన ఆడియో–వీడియో రికార్డిండ్‌ పరికరాలు, రికార్డింగ్‌ స్టూడియోలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని అన్ని రైతు భరోసా కేంద్రాలకు, గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఉద్యాన సహాయకులకు వీడియోల ద్వారా సమాచారం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో విస్తరణ సంచాలకులు డాక్టర్‌ బి.శ్రీనివాసులు, పరిశోధనా సంచాలకులు డాక్టర్‌ ఆర్‌విఎస్‌కె రెడ్డి పాల్గొన్నారు. 


Updated Date - 2020-10-30T04:36:40+05:30 IST