ప్లవనామలో అందరికీ శుభాలు

ABN , First Publish Date - 2021-04-14T06:04:13+05:30 IST

ప్లవనామలో అందరికీ శుభాలు

ప్లవనామలో అందరికీ శుభాలు
ఉగాది పంచాంగ పఠనంలో వేదపండితులు

లబ్బీపేట, ఏప్రిల్‌ 13 : ప్లవనామ సంవత్సరంలో అందరికీ శుభాలు కలుగుతాయిని వేదపండితులు పేర్కొన్నారు. ఉగాది పర్వదినం పురస్కరించుకుని టీటీడీ కళ్యాణ మండపంలో మంగళవారం సాయం త్రం ఉగాది పంచాంగ శ్రవణం వైభవంగా నిర్వహిం చారు. కళ్యాణ మండపంలోని శ్రీవారి ఆలయ ప్రాంగణంలో జరిగిన పంచాంగ శ్రవణంలో వేద పండితులు గబ్బిట ఆంజనేయశాస్త్రి పంచాంగ పఠనం నిర్వహించారు. వేదానికి సంబంధించిన షడంగాల్లో జ్యోతిష్యశాస్త్రం ప్రధానమైనదని, రుతువుల పరి వర్తనం ఈ రోజున ప్రారంభం అవుతాయని సూచిం చారు. ఈ నెల నుంచి ఎండలు ప్రారంభమవు తాయని ఘటోదకం దానం చేయడం మంచిదని, గత వికారి, శార్వవరి సంవత్సరాల్లో మనలో దాగిన వికా రాలన్ని తొలగిపోవటంతో ప్లవనామ సంవత్సరంలో శుభాలు కలుగుతాయని తెలిపారు.  ఈ కార్యక్రమంలో వెంకట గోపాలచార్య, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ వేణుగోపాల్‌, ఏఈ జగన్మోహన్‌, ముని మోహన్‌, శోభారాణి, కాంతికుమార్‌, బాల కోటేశ్వరరావు, భక్తులు పాల్గొన్నారు.

కృష్ణలంక కాళీమాత ఆలయంలో..

 కృష్ణలంక  : ప్లవనామ ఉగాది సందర్భంగా కృష్ణలంక కాళీమాత ఆలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాళీమాతను ధన ధాన్యలక్ష్మిగా అలంకరించారు. ఆలయ పండితులను దేవదాయ శాఖ తరఫున ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాష్‌, 20, 21, 22 డివిజన్ల కార్పొరేటర్లు అడపా శేషు, పుప్పాల కుమారి, తాటిపర్తి కొండారెడ్డి, ఆలయ సూపరింటెండెంట్‌ ప్రసాద్‌, ఆలయ కమిటీ కార్యదర్శి కె.జగదీష్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

చినకంచి చంద్రశేఖరేంద్ర సరస్వతి ఆలయంలో..

విజయవాడ రూరల్‌  :  ప్లవనామ సంవత్సర ఉగా ది వేడుకలు మండలంలోని పలు గ్రామాలలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.  ఆలయా లలో వేకువజాము నుంచే ప్రత్యేక పూజలు చేశారు. చినకంచిలోని  చంద్రశేఖరేంద్ర సరస్వతి ఆలయంలో ట్రస్టీ మొక్కపాటి శర్మ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు జరిగాయి. కామాక్షి అమ్మవారి వసంత ఉత్సవాలను కూడా ప్రారంభించారు. స్థానాచార్యులు ఉమామహే శ్వరం ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీ వరకు ఉత్స వాలు జరుగుతాయని శర్మ తెలిపారు. అమ్మవారికి 12 వేల మల్లెపూలు, 12 వేల నామాలతో అర్చనలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో వేద పాఠశాల అధ్యాపకులు నేతేటి జితేంద్రనాథ్‌ ఘనాపాటి తదితరులు పాల్గొన్నారు. అలాగే నున్నలోని శివాల యంతోపాటు పాతపాడు చెన్నకేశవస్వామి ఆలయం, పీ నైనవరం, అంబాపురం, కొత్తూరు తాడేపల్లి, జక్కంపూడిలోని ఆలయాలలోనూ ఉగాది పర్వదిన వేడుకలు జరిగాయి.

గన్నవరం వాకర్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో 

గన్నవరం  : స్థానిక బాలుర హైస్కూల్‌ క్రీడా మైదానంలో మంగళవారం వాకర్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు జరిగాయి. సర్పంచ్‌ నిడమర్తి సౌజ న్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అధ్యక్షుడు డి.విక్టర్‌ బాబు గడచిన కాలంలో వాకర్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో జరిగిన సేవా కార్యక్రమాలు వివరించారు. ఫౌండర్‌ ప్రెసిడెంట్‌ ముక్కామల సుబ్బారావు, కార్యదర్శి టీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ ఆధ్వర్యంలో కొత్త కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా విక్టర్‌బాబు, కార్యదర్శిగా సీహెచ్‌ శ్రీనివాసరావు, ట్రెజరర్‌గా సి.చంద్రశేఖర్‌రావు ఎన్నికయ్యారు. రోటరీ క్లబ్‌ చైర్మన్‌ చిమట రామారావు, కెఎన్‌ బాబూరావు, సీతారాం పాల్గొన్నారు.

ఉయ్యూరులో.. 

ఉయ్యూరు  : ప్లవ నామ సంవత్సర ఉగాది వేడుకల ను మంగళవారం మండలంలో భక్తిశ్రద్ధలతో జరుపు కు న్నారు. హిందూ పండుగలలో మొదటిదైన ఉగా దికి స్వాగతం పలుకుతూ ఆలయాల్లో పూజలు చేశారు. వేకువజామునుంచి భక్తులు ఆలయాల్లో  స్వామివార్లను  దర్శించి పూజలు చేశారు. ఈ సంద ర్భంగా పలు ఆలయాల్లో ప్లవనామ సంవత్సర పంచాగ శ్రవణం జరిపారు. ఏజీఅండ్‌ఎస్‌జీఎస్‌ కళాశాల వాకర్స్‌ అసోసియేషన్‌, లయన్స్‌క్లబ్‌ ఆధ్వ ర్యంలో కళాశాల ఆవరణలో విష్ణుబట్ల శ్రీరామచంద్ర మూర్తి  పంచాగ పఠనం చేశారు. అసోసియేషన్‌  అధ్యక్ష కార్యదర్శులు సత్యనారాయణ, ఘంటసాల వెంకటేశ్వరరావు, అసోసియేషన్‌  జిల్లా మాజీ గవర్నర్‌ నూకల సాంబశివరావు, లయన్స్‌క్లబ్‌ అధ్యక్ష కార్యదర్శులు చిందా వెంకట కుటుంబరాజు,  ఎస్‌. రామ సత్యకి షోర్‌, పొగిరిరాము, చింతా కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శివాలయంలో పుచ్చా సూర్యప్రకాశశాస్త్రి, విష్ణాలయంలో చక్రవర్తి పంచాంగా పఠణం చేశారు. ఈవో సురేష్‌బాబు, శ్రీనివాసరావు  పంచాంగాలు పంపిణీ చేశారు. 

అభయాంజనేయ స్వామి ఆలయంలో 

 హనుమాన్‌ జంక్షన్‌  :  ప్లవ నామ  సంవత్సర ఉగాది సందర్భంగా స్థానిక అభయాంజనేయ స్వామి ఆలయం భక్తులతో సందడిగా మారింది. అసలే మంగళవారం కావడంతో పాటు ఉగాది  పర్వదినం  కూడా తోడవ్వడంతో ఆలయం కిటకిటలాడింది. ఎండను సైతం లెక్కచేయకుండా భక్తులు బారులు తీరారు. పెద్దసంఖ్యలో  కొత్త వాహనాలు కొనుగోలు చేసుకున్నవారు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 

 స్థానిక  ఏలూరు రోడ్డులోని శివాలయం  వద్ద  ప్లవ నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని  మంగళ వారం  పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని  గాయత్రి బ్రాహ్మణ సంఘం ఆధ్వరం్యలో  నిర్వహించారు. దేవంబొట్ల  శ్రీధర్‌ కుమార్‌ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. ఈ సందర్భంగా  ప్రజలకు 2వేల పంచాం గాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో  సంఘం  అధ్యక్షులు దేవంబొట్ల పురుషోత్తమ శర్మ, బత్తుల వాసుదేవరావు సిద్ధాంతి  తదితరులు పాల్గొన్నారు.శుభాలు

Updated Date - 2021-04-14T06:04:13+05:30 IST