ఘనంగా ఉగాది పర్వదిన వేడుకలు

ABN , First Publish Date - 2021-04-14T05:26:23+05:30 IST

ఘనంగా ఉగాది పర్వదిన వేడుకలు

ఘనంగా ఉగాది పర్వదిన వేడుకలు
రంగనాయక ఫౌండేషన్‌ లోగోను ఆవిష్కరిస్తున్న బాధ్యులు

వడ్డెపల్లి, ఏప్రిల్‌ 13 : హన్మకొండలోని వివిధ డివిజన్లలో మంగళవారం శ్రీప్లవనామ ఉగాది పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. వడ్డెపల్లి శ్రీసీతారామాంజనేయ స్వామి దేవాలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయ ప్రధానార్చకులు మణికొండ వామన్‌కుమార్‌ శర్మ, చైర్మన్‌కటకం ప్రసాద్‌ ఆధ్వర్యంలో గణేష్‌, శేఖర్‌, రాజేష్‌ శ్రీసీతారామాంజనేయ స్వామి ఉత్సవమూర్తుల విగ్రహాలను భక్తి శ్రద్ధలతో ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించి అర్చనలు, అభిషేకాలు చేశారు. సాయంత్రం 51వ డివిజన్‌ తాజామాజీ కార్పొరేటర్‌ మిడిదొడ్డి స్వప్న ఆధ్వర్యంలో మణికొండ వామన్‌కుమార్‌ శర్మ పంచాంగశ్రవణాన్ని పటించారు. గోపాలపురంలో నేను సైతం ఫౌండేషన్‌ సంస్థ వ్యవస్థాపకుడు రావుల వెంకటరమేష్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో స్థానిక గోపాలపురం పాత గ్రామ పంచాయతీ వద్ద పారిశుధ్య కార్మికులకు స్వీట్లను పంపిణీ చేశారు. సామాజిక వేత్త నిమ్మల శ్రీనివాస్‌, పేరాల సురేందర్‌రావు, మంజుల, శానిటరి ఇన్‌స్పెక్టర్‌ భీమయ్య, జవాన్లు మూర్తి రాజు, శ్రీనివాస్‌, నిర్మల పాల్గొన్నారు.

శంభునిపేట : వరంగల్‌ రంగశాయిపేటలోని ప్రాచీన రంగనాయకుని ఆలయంలో ఆదివారం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రంగనాయక ఫౌండేషన్‌ లోగోను ట్రస్టు బాధ్యులు ఆవిప్కరించారు. ఈ వేడుకల్లో భాగంగా కళాకారిణీలు కందగట్ల హాసిని, బేతి మౌనిక, పాము శరణ్యప్రియ ప్రదర్శించిన శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకన్నాయి. వేదపండితుడు వెలిదె ప్రదీ్‌పశాస్ర్తి భక్తులకు పంచాగాన్ని పఠించారు. అనంతరం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కవి సమ్మేళనంలో ప్రముఖ కవులు పాల్గొని తమ కవిత్వాలను వివరించారు. ఈ వేడుకలకు పెద్దసంఖ్యలో భక్తులు హాజరై రంగనాథస్వామిని దర్శించుకున్నారు. అనంతరం నృత్య కళాకారిణీలకు, కవులకు ఘనంగా సత్కరించారు. ఈ వేడుకల్లో ప్రముఖ పాత్రికేయుడు శెంకేశి శంకర్‌రావు, విలాసాగరం సురేందర్‌, నాయిని అశోక్‌, వంచనగిరి తిరుమల్‌, బిల్లా ప్రభాకర్‌, ఇటికాల అశోక్‌, కుమ్మరి కృష్ణమూర్తి, శేర్ల అనిల్‌, గండ్రాతి కుమార్‌, శ్రీరామోజు మోహనాచారి, రామానుజం జగదీశ్వర్‌, జక్కం దామోదర్‌, బి.వెంకన్న, అస్నాల శ్రీనివాస్‌, కొల్లూరి యోగానంద్‌ పాల్గొన్నారు. అలాగే రంగశాయిపేట రామాలయంలో ఆలయ పూజారి తిరుమల శ్రీధరాచార్యులు విశ్వనాథకాలనీ అభయాంజనేయస్వామి ఆలయంలో కోటేశ్వర్‌రావు పంచాంగ పఠనం చేశారు. కార్యక్రమాల్లో బిట్ల పురుషోత్తం, కర్నె రవీందర్‌, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-14T05:26:23+05:30 IST