కోనలో వైభవంగా ఉగాది

ABN , First Publish Date - 2021-04-14T04:33:32+05:30 IST

పెంచలకోన క్షేత్రంలో ఉగాది వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నృసింహుడు ఇష్టవాహనమైన స్వర్ణ గరుడపై కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు.

కోనలో వైభవంగా ఉగాది
స్వర్ణగరుడపై నృసింహుడు

 స్వర్ణగరుడపై నృసింహుడు దర్శనం

రాపూరు, ఏప్రిల్‌ 13: పెంచలకోన క్షేత్రంలో ఉగాది వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నృసింహుడు ఇష్టవాహనమైన స్వర్ణ గరుడపై కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీవారు, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లను ప్రత్యేకంగా ఆలంకరించి విశేష పూజలు, ఆస్తానసేవ నిర్వహించారు. ఆలయ ఏసీ వెంకటసుబ్బయ్య ఆలయ ప్రధాన అర్చకులు రామయ్యస్వామి, పెంచలయ్యస్వామి, వేదపండిట్‌  త్రినాథ కల్యాణ చందూ స్వామికి సన్మానించి ఉగాది పురస్కారాలు అందించారు. ఆలయ అర్చకులు పంచాంగ శ్రవణం చేశారు.  భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించి ఆలయాలకు చేరుకుని పూజలు చేశారు. కోన క్షేత్ర ంలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి నెల్లూరు బీవీ నగర్‌కు చెందిన లక్కు కృష్ణారెడ్డి, ఝాన్సీ దంపతులు లక్షా నూటపదహారు రూపాయలను ఆలయ ఏసీ వెంకటసుబ్బయ్యకు అందించారు.

ముత్యాలమ్మకు పూజలు

చిల్లకూరు, ఏప్రిల్‌ 13: ఉగాది సందర్భంగా మండలంలోని తూర్పుకనుపూరు గ్రామంలో ముత్యాలమ్మకు  ప్రత్యేక పూజలు చేశారు. పలు ప్రాంతాల నుంచి  భక్తులువచ్చి పొంగళ్లు పెట్టి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

Updated Date - 2021-04-14T04:33:32+05:30 IST