ఉరూరా ఉగాది

ABN , First Publish Date - 2021-04-13T05:30:00+05:30 IST

ఉరూరా ఉగాది

ఉరూరా ఉగాది
గణపురంలోని కోటగుళ్లలో ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు

ఘనంగా ‘ప్లవ’ పర్వదిన వేడుకలు

కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూనే ప్రత్యేక పూజలు

దేవాలయాల్లో పంచాంగ శ్రావణం

భూపాలపల్లి టౌన్‌, ఏప్రిల్‌ 13: నూతన తెలుగు శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది వేడుకలను మంగళవారం భూపాలపల్లిలో ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఉదయాన్నే  స్నానమాచరించి కొత్త బట్టలు ధరించి దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే వేద బ్రాహ్మణులు పంచంగ శ్రవణం చేశారు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రాహ్మణుల ద్వారా పంచాంగ శ్రవనం చేయించారు.  భూపాలపల్లి జిల్లా మకరరాశి అయినందున గురువు, శని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని  పండితులు చెబుతున్నారు. బొగ్గు ఉత్పత్తి బాగా జరుగుతుందని, నూతన పరిశ్రమలు వస్తాయని, వ్యాపారాలు బాగా నడుస్తున్నాయని చెబుతున్నారు. పట్టణంలోని శ్రీభక్తాంజనేయస్వామి ఆల యంలో, శ్రీచతుర్రూప అయ్యప్ప దేవాలయంలో, సహస్ర లింగేశ్వర దే వాలయంలో,  సీతారామాంజనేయస్వామి,  కృష్ణ మందిర్‌లో ప్రత్యేక పూజలు జరిగాయి.

 ములుగు : శ్రీప్లవనామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని జిల్లా ప్రజలు మంగళవారం నిరాడంబరంగా జరుపుకున్నారు. ఇళ్ల ముంగిళ్లను పువ్వులు, మామిడితోరణాలతో అలంకరించుకున్నారు. షడ్రుచుల మిలితమైన ఉగాది పచ్చడిని తయారుచేసుకుని ఇంటిల్లిపాది సేవించారు. ఇష్టదైవాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాల్లో పంచాంగ శ్రవణంపై కొవిడ్‌ నిబంధనలు ప్రభావం చూపాయి. ఒకటి,రెండుచోట్ల ఆలయాల్లో అంతరంగికంగా పంచాంగాన్ని చదివి వినిపించారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ఉగాది పండుగ జరుపుకున్నారు. మట్టికుండల్లో ఉగాది పచ్చడిని తయారుచేసుకునే సంప్రదాయం క్రమంగా తగ్గుతున్నట్లు కనిపించింది. కొంతమంది మాత్రమే మట్టి కుండలను కొనుగోలు చేశారు. జిల్లాలో కరోనా వైరస్‌ ప్రభావం కొనసాగుతుండగా ఆంక్షల నడుమ తెలుగు సంవత్సరం ప్రారంభం రోజు సందడి లేకుండానే ముగిసింది.  

 చెల్పూరు :  ఉగాది పర్వదినం సందర్భంగా  గణపురం మండలంలోని చెల్పూరులో  ప్రజలు  ప్రత్యేక పూజలు చేశా రు. తెల్లవారుజామునే ఇంటి పరిసరాలను శుభ్రంచేసి నూత న వస్త్రాలు ధరించి పలు ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. షడ్రుచులతో ఉగాది పచ్చడి తయారు చే సి కుటుంబ సభ్యులంతా ఆరగించారు. రైతులంతా నూతన సంవత్సరంలో పంటలు బాగా పండాలని కోరుకున్నారు. కాకతీయ థర్మల్‌ ప్లాంటులో వేడుకలను  నిర్వహించారు. 

 మహదేవపూర్‌: మండలంలో ఉగాది వేడుకలు ఘ నంగా జరిగాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాల వద్ద నిర్వహించే పం చాగ శ్రవణాలను కూడా అధికారులు రద్దు చేశారు.

 రేగొండ : ఉగాది పర్వదిన వేడుకలను ప్రజలు భక్తి శ్ర ద్ధ నిర్వహించారు. మండల కేంద్రంలోని వేణుగోపాలస్వామి ఆలయం, కొడవటంచ గ్రామంలోని లక్ష్మీ నరసింహాస్వామి ఆలయం, రావులపల్లిలోని రామాలయంతో పాటు పలు గ్రా మ పంచాయతీల్లో ఉగాది వేడుకలను నిర్వహించారు.  ప్ర జలు తమ ఇళ్లకు మామిడి తోరణాలతో ముస్తాబు చేసి షడ్రులతో   ఉగాది పచ్చడిని ఆరగించారు. ఆలయాల్లో పం చాంగ శ్రవణం నిర్వహించారు. రైతులంతా నూతన సంవత్సరంలో పంటలు బాగా పండాలని కోరుకున్నారు. 

 కాటారం : మండలంలో ఉగాది పర్వదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఉదయాన్నే ప్రజలు తలంటు స్నానాలు చేసి, నూతన వస్త్రాలు ధరించి, షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని సేవించారు. బూరెలు తిన్నా రు. కరోనా నిబంధనలు పాటిస్తూనే ఆలయాలో పూజలు చేశారు. రైతులు నాగళ్లు, ఎద్దులకు పసుపు, కుంకుమలతో అలంకరించారు. ఉగాది నాడు వ్యవసాయ పనులు మొదలెడితే ఆ ఏడాది పంట దిగుబడులు బాగుంటాయనే నమ్మకంతో అనాదిగా వస్తున్న ఏరువాక(సాగుబాటు)ను రైతులు జరుపుకున్నారు. కొంతమంది ట్రాక్టర్లతో దుక్కులు దున్నే కార్యక్రమాన్ని చేపట్టారు. మండల కేంద్రంలో శ్రీఅభయాంజనేయస్వామి, రేగులగూడెంలో భక్తాంజనే యస్వామితో పాటు పలు గ్రామాల్లోని ఆలయాల వద్ద వేదపం డితులు పంచాంగ శ్రవణం చేశారు. ఈ కార్యక్రమాల్లో పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలు తదితరులు పాల్గొన్నారు. 

గణపురం: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మం డల కేంద్రంలోని కాకతీయుల చారిత్రాత్మక కోటగుళ్లలో భక్తు లు   ప్రత్యేక పూజలు చేశారు. మండల కేంద్రంలోని రెడ్డిగుడిలో   ఆలయ పరిరక్షణ కమిటీ సభ్యులు సురేష్‌ ఆధ్వర్యం లో కవి సమ్మేళనం నిర్వహించారు. బుద్దారంలోని రామలింగేశ్వ రస్వామి దేవాలయంలో భక్తులకు ప్రత్యేక పూజలు చేశా రు.  స ర్పంచ్‌ గండ్ర ఆగంరావు, ఉప సర్పంచ్‌ రవీందర్‌, ఆలయ పరిరక్షణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

 భూపాలపల్లి కలెక్టరేట్‌ : బీజేపీ జిల్లా కార్యాలయంలో ఉగాది పర్వాదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ రాష్ట్ర కా ర్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తిరెడ్డి,  జిల్లా అధ్యక్షుడు కన్నం యుగేందర్‌ పాల్గొన్నారు. సామాజిక దూరం పాటించి ప్లవనామ సంవత్సరంలో కరోనాను పారదోలాలన్నారు.   పార్టీ నాయకులు నిశిధర్‌ రెడ్డి, జగన్‌, గణపతి, రామకృష్ణ, రఘునాధ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 మంగపేట : మండలంలో ప్రజలు ఉగాదిని ఘనంగా జ రుపుకున్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఆలయా ల్లో ప్రత్యేక పూజలు చేశారు. పంచాగ శ్రవణాలు నిర్వహించారు. మల్లూరు హేమాచల క్షేత్రంలో భక్తులు భారీ సం ఖ్యలో పూజల్లో పాల్గొన్నారు. మంగపేట సహకార సంఘం చైర్మన్‌ తోట రమేష్‌ దైవ దర్శనాలను చేసుకున్నారు. ఉగా ది వేడుకల్లో ఆలయ ఈవో సత్యనారాయణ, అర్చకులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. 

 వెంకటాపురం(నూగూరు) : మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలు శ్రీప్లవనామ సంవత్సర ఉగాది పండుగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజామున కొందరు రైతులు ఏరువాక సాగించారు. ఇళ్ల ముందు గుమ్మాలకు మామిడాకుల తోరణాలు అలంకరించారు. ఈ సందర్భంగా కుటుంబసమేతంగా ఇంట్లో దేవుళ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీపి, పులుపు సమ్మేళనంతో తయా రుచేసిన పచ్చడిని ఆస్వాదించారు. సాయంత్రం మండల కేంద్రంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో పండితులు పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Updated Date - 2021-04-13T05:30:00+05:30 IST