అప్లయిడ్‌ మ్యాథమాటిక్స్‌ మ్యాథ్స్‌తో సమానం

ABN , First Publish Date - 2021-09-18T08:08:19+05:30 IST

ఇంజనీరింగ్‌, బేసిక్‌ సైన్సెస్‌ మినహా మిగతా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం అప్లయిడ్‌ మ్యాథమాటిక్స్‌ సబ్జెక్టును మ్యాథమాటిక్స్‌తో సమానంగా పరిగణించాలని యూనివర్సిటీలను యూజీసీ...

అప్లయిడ్‌ మ్యాథమాటిక్స్‌ మ్యాథ్స్‌తో సమానం

  • డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి పరిగణించాలి: యూజీసీ

న్యూఢిల్లీ, సెప్టెంబరు17: ఇంజనీరింగ్‌, బేసిక్‌ సైన్సెస్‌ మినహా మిగతా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం అప్లయిడ్‌ మ్యాథమాటిక్స్‌ సబ్జెక్టును మ్యాథమాటిక్స్‌తో సమానంగా పరిగణించాలని యూనివర్సిటీలను యూజీసీ ఆదేశించింది. 11, 12 తరగతుల్లో అప్లయిడ్‌ మ్యాథమాటిక్స్‌ చదివిన వారిని కామర్స్‌, హ్యుమానిటీస్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి అనుమతించాలంటూ అన్ని యూనివర్సిటీల వైస్‌ చాన్సలర్లకు లేఖ రాసింది. సీనియర్‌ సెకండరీ విద్యార్థులకు మ్యాథమాటిక్స్‌తోపాటు అప్లయిడ్‌ మ్యాథమాటిక్స్‌ పేరుతో మరో సబ్జెక్టును సీబీఎ్‌సఈ బోర్డు అందిస్తోంది. హ్యుమానిటీస్‌, కామర్స్‌ స్ట్రీమ్‌ విద్యార్థులు చాలామంది దీన్ని ఎంచుకుంటారు. 


Updated Date - 2021-09-18T08:08:19+05:30 IST