ఇది కూడా ఉద్యోగమేనా..? దీనికే నెలకు రూ.25 లక్షలిస్తారా..? అవాక్కవుతున్న నెటిజన్లు.. అర్హతలుంటే మీరు కూడా దరఖాస్తు చేసేయండి..!

ABN , First Publish Date - 2021-10-20T01:10:58+05:30 IST

క్రాఫ్టెడ్ బెడ్స్ కంపెనీ ఓ ప్రకటన ఇచ్చింది. తమ కంపెనీలో ఉద్యోగం పొందిన వ్యక్తి.. రోజూ ఆరు నుంచి ఏడు గంటల పాటు మంచం మీద పడుకుని ఉండాలని ప్రకటించింది. ఇందుకోసం ఎంపికైన వ్యక్తికి కంపెనీ నుంచి వార్షిక ప్యాకేజీ 24 వేల పౌండ్లు(రూ.25 లక్షలు)

ఇది కూడా ఉద్యోగమేనా..? దీనికే నెలకు రూ.25 లక్షలిస్తారా..? అవాక్కవుతున్న నెటిజన్లు.. అర్హతలుంటే మీరు కూడా దరఖాస్తు చేసేయండి..!

చొక్కా నలగకుండా పని చేయాలని చాలా మందికి ఉంటుంది. హాయిగా ఏసీలో కూర్చుని చేసే పని కుదిరితే బాగుండు అనుకుంటూ కలలు కంటూ ఉంటారు. అయితే కొందరికి ఆ కలలు కల్లలుగానే మిగులుతుంటాయి. అయితే అలాంటి వారికి ఇది ఓ అద్భుత అవకాశమని చెప్పొచ్చు. ఎలాంటి అవకాశమంటే.. ఇది కూడా ఉద్యోగమేనా, ఇంత చిన్న పనికి రూ.25లక్షల జీతమా అంటూ నోరెళ్లబెట్టేంత సువర్ణావకాశం. ఓ UK కంపెనీ ప్రత్యేక ఉద్యోగాలను ఆఫర్ చేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..


క్రాఫ్టెడ్ బెడ్స్ కంపెనీ ఓ ప్రకటన ఇచ్చింది. తమ కంపెనీలో ఉద్యోగం పొందిన వ్యక్తి.. రోజూ ఆరు నుంచి ఏడు గంటల పాటు మంచం మీద పడుకుని ఉండాలని ప్రకటించింది. ఇందుకోసం ఎంపికైన వ్యక్తికి కంపెనీ నుంచి వార్షిక ప్యాకేజీ 24 వేల పౌండ్లు(రూ.25 లక్షలు) ఇవ్వబడుతుంది. ఇందులో చేరిన ఉద్యోగులు ప్రతి వారం పరుపులను పరీక్షించాలి. నాణ్యత గల పరుపుల జాబితా తయారు చేస్తే.. కంపెనీ దానిని లెక్కిస్తుంది. అలాగే దిండ్లు కూడా ఎలా ఉన్నాయో పరీక్షించాల్సి ఉంటుంది. ఇవి మరింత నాణ్యతగా ఉండేందుకు చేయాల్సిన మార్పులను కంపెనీ వారికి సూచించారు.


పరుపులపై వారానికి 37.5 గంటలు పడుకోవాలి. ఇందుకోసం రోజూ ఆరు గంటలు టీవీ చూడటం, లేదా నిద్రపోవాల్సి ఉంటుంది. వర్క్ ఫ్రం హోం మాదిరిగానే.. ఎంపికైన ఉద్యోగులకు పరుపులు, దిండ్లను ఇంటికే పంపుతామని కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ బ్రియాన్ డిల్లాన్ అన్నారు. పరుపులు, దిండ్ల నాణ్యతపై ఓ సమీక్ష రాసి కంపెనీకి పంపవచ్చని సూచిస్తున్నారు. ఈ వార్త తెలిసిన వారంతా వావ్.. ఏం ఉద్యోగం.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Updated Date - 2021-10-20T01:10:58+05:30 IST