బ్రిటన్ కీలక నిర్ణయం.. భారతీయులకు మాత్రం నిరాశే!

ABN , First Publish Date - 2021-07-29T22:47:32+05:30 IST

బ్రిటన్ ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది. అయితే భారతీయులకు మాత్రం అది నిరాశే మిగిల్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. యూఎస్, యురోపియన్ యూనియన్ ప్రజలకు బ్రిటన్ తీపి కబురు చెప్పింది. పూ

బ్రిటన్ కీలక నిర్ణయం.. భారతీయులకు మాత్రం నిరాశే!

న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది. అయితే భారతీయులకు మాత్రం అది నిరాశే మిగిల్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. యూఎస్, యురోపియన్ యూనియన్ ప్రజలకు బ్రిటన్ తీపి కబురు చెప్పింది. పూర్తి స్థాయిలో కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఈయూ, యూఎస్ ప్రయాణికులు.. బ్రిటన్‌కు చేరుకున్న తర్వాత 10 రోజులపాటు తప్పనిసరిగా క్వారెంటైన్ ఉండాల్సిన అవసరం లేదు. ఈ మేరకు బ్రిటన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే రెడ్ లిస్ట్ జాబితాలో ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఈ ఆదేశాలు వర్తించవని బ్రిటన్ స్పష్టం చేసింది. రెడ్ లిస్ట్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు పూర్తి స్థాయిలో కొవిడ్ టీకా తీసుకున్నప్పటీకి 10 రోజులపాటు క్వారెంటైన్‌లో ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. దీంతో భారత్‌ కూడా రెడ్‌లిస్ట్ దేశాల జాబితాలో ఉన్నందున ఇండియా నుంచి బ్రిటన్ వెళ్లే ప్రయాణికులు వ్యాక్సీన్ తీసుకున్నప్పకీ అక్కడ క్వారెంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. 


Updated Date - 2021-07-29T22:47:32+05:30 IST