రష్మీ సమంత్ ఘటనపై బ్రిటన్ ప్రధానికి ప్రవాస భారతీయుల లేఖ

ABN , First Publish Date - 2021-04-11T02:26:05+05:30 IST

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు దాదాపు 119 భారతీయ సంఘాల ప్రతినిధులు లేఖ రాశారు. రష్మీ సమంత్ వ్యవహారంలో అభిజిత్ సర్కార్ పాత్ర తేలే వరకు ఆయన్ను సస్పెండ్ చేయాలని లేఖలో కోరారు. పూర్తి

రష్మీ సమంత్ ఘటనపై బ్రిటన్ ప్రధానికి ప్రవాస భారతీయుల లేఖ

న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు దాదాపు 119 భారతీయ సంఘాల ప్రతినిధులు లేఖ రాశారు. రష్మీ సమంత్ వ్యవహారంలో అభిజిత్ సర్కార్ పాత్ర తేలే వరకు ఆయన్ను సస్పెండ్ చేయాలని లేఖలో కోరారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. భారత్‌కు చెందిన రష్మీ సమంత్.. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్‌గా ఎన్నికై చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అయితే గతంలో ఆమె చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో రష్మీ సమంత్ తన పదవికి రాజీనామా చేయాలని సోషల్ మీడియాలో పలువురు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పదవిని చేపట్టిన రోజుల వ్యవధిలోనే రష్మీ సమంత్ రాజీనామా చేశారు. అయినప్పటికీ ఆమెపై ట్రోలింగ్ ఆగలేదు. ఈ క్రమంలో రష్మీ సమంత్ బ్రిటన్‌ను వీడింది.


కాగా.. ఈ మొత్తం వ్యవహారంపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా పని చేస్తున్న అభిజిత్ సర్కార్ కారణంగానే రష్మీ సమంత్ రాజీనామా చేయాల్సి వచ్చిందని భారతీయ సంఘాల ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. రష్మీ సమంత్‌పై సోషల్ మీడియాలో వెల్లవెత్తున ఆరోపణలను అభిజిత్ సర్కారే ప్రోత్సహించారని.. ఈ క్రమంలో ఒత్తిడి తట్టుకోలేక రష్మీ సమంత్ ఆసుపత్రి పాలయ్యారని ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని భారతీయ సంఘాల ప్రతినిధులు యూకే ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకండా ఈ వ్యవహారంలో విచారణ పూర్తైయ్యే వరకు అభిజిత్ సర్కార్‌ను విధుల నుంచి తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని లేఖలో కోరారు. బ్రిటన్ ప్రధానికి లేఖ రాసిన వారిలో హిందూ ఫోరమ్ ఫర్ యూరప్, విశ్వ హిందూ పరిషద్ యూకే, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ హిందూ టెంపుల్స్ తదితర సంఘాల ప్రతినిధులు ఉన్నారు.  


Updated Date - 2021-04-11T02:26:05+05:30 IST