మన దేశాల బంధంలో కొత్త శకం మొదలైంది!

ABN , First Publish Date - 2021-05-05T08:28:13+05:30 IST

యునైటెడ్‌ కింగ్‌డమ్‌-భారత్‌ల మధ్య బం ధంలో కొత్త శకం మొదలైందని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ మంగళవారం పేర్కొన్నారు...

మన దేశాల బంధంలో కొత్త శకం మొదలైంది!

  • ప్రధాని మోదీతో వర్చువల్‌ భేటీలో బోరిస్‌
  • మాల్యా, నీరవ్‌లపైనా చర్చ

లండన్‌, మే 4: యునైటెడ్‌ కింగ్‌డమ్‌-భారత్‌ల మధ్య బం ధంలో కొత్త శకం మొదలైందని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ మంగళవారం పేర్కొన్నారు. భార త ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన వర్చువల్‌ శిఖరాగ్ర సమావేశంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. మంగళవారం ఇరు దేశాలు చేసుకున్న ఒప్పందాలు కొత్త శకానికి నాంది పలుకుతాయని ఆయన స్పష్టం చేశారు. ఇరు దేశాల ఆరోగ్యం, పర్యావరణం, వాణిజ్యం, విద్య, శాస్త్ర సాంకేతి క, రక్షణ రంగాల్లో బంధాన్ని 2030కల్లా మరింత బలోపేతం చేసుకునేలా ఒక రోడ్‌ మ్యాప్‌ను తయారుచేయాలని ఇరువురు అగ్రనేతలు అంగీకరించా రు. కాగా.. విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీని భారత్‌కు రప్పించడంపైనా ఇరు దేశాధినేతలు చర్చించినట్లు తెలుస్తోంది. వారిద్దరినీ భారత్‌కు త్వరగా పంపిచేలా చూడాలని భారత ప్రధాని కోరగా.. అందుకు బోరిస్‌ సానుకూలంగా స్పందించారని భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది.  


Updated Date - 2021-05-05T08:28:13+05:30 IST