యూకే ప్రయాణ ఆంక్షలు మరింత కఠినం

ABN , First Publish Date - 2021-01-17T07:49:29+05:30 IST

కరోనా కొత్త స్ట్రెయిన్‌ను అడ్డుకునేందుకు యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ప్రయాణ ఆంక్షల్ని మరింత కఠినతరం చేసింది. బ్రెజిల్‌,

యూకే ప్రయాణ ఆంక్షలు మరింత కఠినం

లండన్‌, జనవరి 16: కరోనా కొత్త స్ట్రెయిన్‌ను అడ్డుకునేందుకు యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ప్రయాణ ఆంక్షల్ని మరింత కఠినతరం చేసింది. బ్రెజిల్‌, దక్షిణ అమెరికా సహా పలు దేశాలకు సోమవారం నుంచి తాత్కాలిక ప్రయాణ ఆంక్షలు విధించింది. ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రాంతం నుంచి వచ్చినవారైనా.. కచ్చితంగా 72 గంటల ముందు తీసుకున్న కొవిడ్‌ పరీక్ష నెగటివ్‌గా తేలిన నివేదికను వెంట ఉంచుకోవాలని.. బ్రిటన్‌ చేరిన తర్వాత కనీసం 10 రోజులు స్వీయ ఐసొలేషన్‌లో ఉండాలని యూకే ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ శుక్రవారం చెప్పారు. బ్రిటన్‌కు చేరిన 5వ రోజున మళ్లీ పరీక్ష చేయించుకోవాలన్నారు. 

Updated Date - 2021-01-17T07:49:29+05:30 IST