ఆమె వయసు 34 ఏళ్లు.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా కూరగాయలు తినలేదు.. ఇదో విచిత్రమైన Phobia

ABN , First Publish Date - 2021-10-14T05:56:21+05:30 IST

ప్రపంచంలో కొంతమంది వింత వ్యాధులతో బాధపడుతుంటారు. కొందరికి చీకటంటే భయం. మరికొందరికి ఒంటరిగా ఉండడం అంటే భయం. ఇంకొందరికి ఎత్తైన ప్రదేశాలంటే భయం. ఇలా ఒక్కొక్కరికీ ఒక్కో భయం ఉంటుంది. వీటినే ఫోబియా అంటారు. అయితే ఈ ఫోబియాలు వారి రోజువారీ జీవితంపై పెద్దగా ప్రభావం చూపించవు. కానీ ఇంగ్లండ్‌లోని యార్క్‌షైర్‌కు చెందిన కార్లోట్ విట్టిల్ వీటన్నింటికంటే విచిత్రమైన, దారుణమైన ఫోబియాతో బాధపడుతున్నారు.

ఆమె వయసు 34 ఏళ్లు.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా కూరగాయలు తినలేదు.. ఇదో విచిత్రమైన Phobia

లండన్: ప్రపంచంలో కొంతమంది వింత వ్యాధులతో బాధపడుతుంటారు. కొందరికి చీకటంటే భయం. మరికొందరికి ఒంటరిగా ఉండడం అంటే భయం. ఇంకొందరికి ఎత్తైన ప్రదేశాలంటే భయం. ఇలా ఒక్కొక్కరికీ ఒక్కో భయం ఉంటుంది. వీటినే ఫోబియా అంటారు. అయితే ఈ ఫోబియాలు వారి రోజువారీ జీవితంపై పెద్దగా ప్రభావం చూపించవు. కానీ ఇంగ్లండ్‌లోని యార్క్‌షైర్‌కు చెందిన కార్లోట్ విట్టిల్ వీటన్నింటికంటే విచిత్రమైన, దారుణమైన ఫోబియాతో బాధపడుతున్నారు. 34 ఏళ్ల వయసున్న కార్లోట్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా శాకాహారం తినలేదు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఆమెకు శాకాహారం చూడగానే భయం కలుగుతుంది. ఇక వాటిని తింటే ఏకంగా వాంతులైపోతాయి.


ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్న కార్లోట్.. తన ఫోబియా గురించి వివరించారు. చిన్నప్పటి నుంచి ఇదే సమస్యతో బాధపడుతున్నా.. తన తల్లి ఆసుపత్రికి తీసుకెళ్లలేదని, కాలం గడిచేకొద్దీ పరిస్థితి మారుతుందని భావించేందని చెప్పుకొచ్చారు. ‘కానీ 18 ఏళ్ల వయసులో ఉద్యోగరీత్యా నేను వేరేగా ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో నేను పనిచేసే సంస్థలో తోటి వారితో చాలా ఇబ్బందులు పడ్డాను. అక్కడ మధ్యాహ్న సమయంలో భోజనం పెట్టేవారు. వంట వండే వారితో నా కోసం ప్రత్యేంగా తయారు చేయమని బతిమాలుకున్నాను. అలా జీవితం వెళ్లదీస్తున్నాను.


ఈ ఫోబియా కారణంగా ఇప్పటివరకు నేను సింగిల్‌గానే ఉన్నాను. ఎవరితోనైనా సన్నిహితంగా, కలిసి బతకాలని అనిపిస్తుంటుంది. అయితే ఈ టీవీ షోకు వచ్చిన తరువాత కొద్ది కొద్దిగా మారుతున్నాను. ఇప్పడిప్పుడే పాస్తా, పిజ్జా వంటివి తింటున్నాను. నా ఆశ ఒక్కటే నా స్నేహితులతో కలిసి ఎలాంటి అడ్డంకులూ లేకండా అన్నీ తినగలగాలి. అలా ఎప్పటికి మారతానో ఏమో’ అని కార్లోట్ చెప్పుకొచ్చారు.

Updated Date - 2021-10-14T05:56:21+05:30 IST