ఐసీయూలో 10 నెలలు.. ఈ బతుకు తనకొద్దని!

ABN , First Publish Date - 2021-06-20T22:31:04+05:30 IST

జాసన్ కెక్ (45).. ఈ పేరును మీరు వినే ఉంటారు. సుదీర్ఘ కాలం కరోనాతో పోరాడి గెలిచిన వ్యక్తిగా వార్తల్లో నిలిచారు. అయితే ప్రస్తుతం ఆయన ఇకలేరు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస వి

ఐసీయూలో 10 నెలలు.. ఈ బతుకు తనకొద్దని!

లండన్: జాసన్ కెక్ (45).. ఈ పేరును మీరు వినే ఉంటారు. సుదీర్ఘ కాలం కరోనాతో పోరాడి గెలిచిన వ్యక్తిగా వార్తల్లో నిలిచారు. అయితే ప్రస్తుతం ఆయన ఇకలేరు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 


బ్రిటన్‌కు చెందిన జాసన్ కెక్.. గత ఏడాది మార్చి 21న కొవిడ్ బారినపడ్డారు. ఈ క్రమంలో అతని కిడ్నీలు, ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపడంతో అవి బాగా దెబ్బతిన్నాయి. దీంతో కుటుంబ సభ్యులు జాసన్ కెక్‌ను సేయింట్ జేమ్స్ ఆసుపత్రికి తరలించారు. దాదాపు 10నెలలపాటు ఇన్‌టెన్సివ్ కేర్‌లో ఉండి చికిత్స పొందారు. ఈ క్రమంలో వైద్యుల కృషి ఫలించింది. దీంతో మహమ్మారితో సుదీర్ఘకాలంపాటు పోరాడి, దాన్ని జయించారు. 10నెలలపాటు బెడ్‌కే పరిమితం అయిన జాసన్ కెక్.. ఆరోగ్యం కుదుటపడటంతో తిరిగి నడవటానికి ప్రయత్నించారు. ఇందుకోసం నర్సుల సహాయాన్ని తీసుకున్నారు. 



నడవటానికి ప్రయత్నాలు ప్రారంభించి రోజులు గడిచినా పరిస్థితి మెరుగుపడలేదు. బెడ్ దిగితే.. నడవడానికి ఇతరులపై ఆధారపడటం తప్పలేదు. కరోనా అనంతరం కూడా ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో.. చికిత్స తీసుకుంటూ ఆసుపత్రిలోనే ఉండిపోయారు. ఈ క్రమంలో జాసన్ తీవ్ర మనోవేధనకు గురయ్యారు. సొంతంగా నడవలేకపోవడం.. ఎప్పుడు ఏమవుతుందో అనే భయంతో బిక్కుబిక్కుమంటూ జీవించే బతుకు తనకొద్దు అనుకున్నారు. చివరికి కఠిన నిర్ణయం తీసుకుని.. చావడానికి సిద్ధమయ్యారు. అదే విషయాన్ని డాక్టర్లకు చెప్పారు. ‘ఈ బతుకు నాకొద్దు.. ప్లీజ్ ట్రీట్‌మెంట్ ఆపేయండి’ అని వైద్యులను కోరారు. దీంతో వైద్యులు జాసన్ కెక్ కుటుంబ సభ్యుల అంగీకారంతో వైద్యం ఆపేశారు. ఈ నేపథ్యంలో శనివారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి, తుదిశ్వాస విడిచారు. 


Updated Date - 2021-06-20T22:31:04+05:30 IST