ఉలికిపాటు

ABN , First Publish Date - 2021-07-30T04:50:47+05:30 IST

కాటన్‌ సీడ్‌ జీవోటీ (గ్రో ఔట్‌ టెస్ట్‌)లో పాసైన విత్తనాలను కూడా ఫెయిల్‌ అని చెబుతూ ఆర్గనైజర్లు రైతు లను మోసం చేస్తున్న విషయాన్ని ఆంధ్రజ్యో తి ‘పాసైనా.. ఫెయిల్‌’ శీర్షికన గురువారం ప్ర చురించిన విషయం తెలిసిందే.

ఉలికిపాటు
మల్దకల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్న రైతులు (ఫైల్‌)

- విత్తనాలు ఫెయిలని చెప్పిన రైతులను పిలుస్తున్న ఆర్గనైజర్లు

- ఇప్పటికే కొందరికి డబ్బుల చెల్లింపు

- మరికొంత మందికి చెల్లించేందుకు ఏర్పాట్లు


గద్వాల, జూలై 29 (ఆంధ్రజ్యోతి) : కాటన్‌ సీడ్‌ జీవోటీ (గ్రో ఔట్‌ టెస్ట్‌)లో పాసైన విత్తనాలను కూడా ఫెయిల్‌ అని చెబుతూ ఆర్గనైజర్లు రైతు లను మోసం చేస్తున్న విషయాన్ని ఆంధ్రజ్యో తి ‘పాసైనా.. ఫెయిల్‌’ శీర్షికన గురువారం ప్ర చురించిన విషయం తెలిసిందే. అయితే, ఈ క థనం జోగుళాంబ గద్వాల జిల్లాలోని సీడ్‌ ఆ ర్గనైజర్లను ఒక్కసారిగా ఉలికిపాటుకు గురి చేసిం ది. ఇన్నాళ్లు యథేచ్ఛగా సాగిస్తున్న ఈ మోసాన్ని బ ట్టబయలు చేయడంతో, వారిలో ఆందోళన మొదలైంది. ఇప్పటికే మల్దకల్‌ మం డలం అడవిరావుల చెరువు సీడ్‌ రైతులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఆంధ్రజ్యోతి కూడా మోసాలను బహిర్గతం చేస్తుండటంతో ఆర్గనైజర్లు కొంత మంది రైతులకు డబ్బులు చెల్లించేందుకు సిద్ధపడుతున్నారు. అడవిరావుల చెరు వు గ్రామానికి చెందిన ఇద్దరు రైతులకు డబ్బులు ముట్టజెప్పారు. ఓ రైతు కు టుంబంలో త్వరలో శుభకార్యం ఉండగా, ఇన్నాళ్లు ఎంత ప్రాదేయపడినా ఫలితం రాలేదు. కానీ, అటు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు, ఇటు నడిగడ్డ రైతు హ క్కుల పోరాట సమితి సూచనలు, ఆంధ్రజ్యోతి కథనాలతో దాదాపు రూ.3.60 లక్ష లు రెండు విడతలుగా ఆ రైతుకు చెల్లించినట్లు తెలుస్తోంది. అలాగే మరో యువ రైతుకు సంబంధించి 180 కేజీల విత్తనాల్విగా, గతంలో ఫెయిల్‌ అయ్యాయని చె ప్పారు. కంపెనీలు ఇచ్చిన ఫెయిల్‌ జాబితా చూసి, ఆర్గనైజర్‌ను మళ్లీ అడిగినా అదే సమాధానం చెప్పారు. చివరకు కేసు నమోదు చేయడంతో డబ్బులు చెల్లిం చారు. అలాగే మరి కొంత మంది రైతులకు కూడా డబ్బులు చెల్లించేందుకు ఏ ర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. కేసు నమోదై, జాబితా మొత్తం బయటపడితే మొదటికే మోసం వస్తుందని భావించిన కొందరు ఆర్గనైజర్లు రైతులకు ఫోన్లు చే స్తున్నారు. కొందరు సగం పేమెంట్‌ కంపెనీలతో మాట్లాడి ఇప్పిస్తామని, రావాల ని, కేసు విత్‌డ్రా చేసుకోవాలని చెబుతున్నట్లు సమాచారం. అయితే, రైతులు మాత్రం తమ విత్తనాలు పాసైతే మొత్తం చెల్లింపులు చేయాల్సిందేనని, లేకపోతే కేసు ఉపసంహకరించుకోబోమని చెబుతున్నారు. 


బాధితులు చాలా మందే..

ప్రస్తుతం రెండు కంపెనీలకు సీడ్‌ విక్రయించిన రైతులు బాధితులుగా ఉన్న ట్లు తెలుస్తోంది. మరికొన్ని కంపెనీలకు సంబంధించి కూడా రైతులను ఆర్గనైజ ర్లు మోసం చేసినట్లుగా తెలుస్తోంది. అయితే, వారు ఆర్గనైజర్లపై భయంతోనో.. బెదిరింపులతోనో బయటకు రావడం లేదు. ఒక్కో మెయిన్‌ ఆర్గనైజర్‌ దగ్గర పా సైనా, ఫెయిల్‌ అని చెప్పడంతో మోసపోయే బాధితులు దాదాపు పదుల సంఖ్య లో ఉంటారని తెలుస్తోంది. అందరూ ముందుకు వస్తే.. ఆర్గనైజర్ల మోసాలను మరింత వెలుగులోకి తెచ్చే అవకాశం ఉంటుందని రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు. కంపెనీలు గడిచిన సంవత్సరం కొన్ని మాత్రమే ఫెయిల్‌ అయిన సీడ్‌ రైతుల జాబితా ఇవ్వగా, ఈ సంవత్సరం దాదాపు 12 కంపెనీల్లో ఎనిమిది కంపెనీల వరకు ఇచ్చాయి. అయితే, జాబితాలు ప్రభుత్వానికి ఇస్తుండటంతో ఆర్గ నైజర్లు సతమతమవుతున్నారు. తాము చెప్పినట్లు నడుచుకునే రైతులు ఇప్పుడు ప్రశ్నించే స్థాయికి వచ్చారనే ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. ప్రధానంగా రై తుల నుంచి తమకు జీవోటీకి సంబంధించిన ధ్రువపత్రాలు కావాలనే డిమాండ్‌ వ్యక్తమవుతోంది. తాము పండించిన పంట పాసైందో.. ఫెయిల్‌ అయ్యిందో తెలు సుకునే హక్కు తమకు కల్పించాలని రైతులు కోరుతున్నారు. ఆ సర్టిఫికెట్లు ఉం టే తమను ఆర్గనైజర్లు మోసం చేసే అవకాశం ఉండదని చెబుతున్నారు. అలాగే కంపెనీలే నేరుగా రైతులకు డబ్బులు వేయడం, వారి ఆధ్వర్యంలోనే సర్టిఫికెట్లు పంపిణీ చేయడం వంటివి అమలుపర్చాలని కూడా రైతులు డిమాండ్‌ చేస్తున్నా రు. తమకు వచ్చే కొద్దిమొత్తం కూడా ఫెయిలయ్యాయని తీసుకొని, తమను మో సం చేయొద్దని ఆవేదన చెందుతున్నారు.

Updated Date - 2021-07-30T04:50:47+05:30 IST