Apr 21 2021 @ 13:57PM

'సుల్తాన్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..!

కరోనా కారణంగా తెలుగు, తమిళం హిందీ సహా పలు ఇతర భాషల సినిమాలు ఓటీటీ బాట పడుతున్నాయి. ఇప్పటికే పలు చిత్రాలు ఓటీటీలో రిలీజై ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రేక్షకులు కూడా థియేటర్స్ వరకు సినిమా చూడాలంటే ధైర్యం చేయడం లేదు. హాయిగా ఇళ్ళలోనే కూర్చొని కుదిరినప్పుడు నచ్చిన సినిమా చూసేస్తున్నారు. దాంతో థియేటర్స్‌లో వచ్చిన సినిమాలు కూడా పెద్ద గ్యాప్ లేకుండానే టీవీలలో.. డిజిటల్ ప్లాట్‌ఫాంలోనూ వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటించిన లేటెస్ట్ సినిమా 'సుల్తాన్' ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకుంది. ఈ సినిమాకి రెమో ఫేమ్ బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహించాడు. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్.ప్రకాష్ బాబు ఎస్.ఆర్. ప్రభు నిర్మించారు. ఈ సినిమాలో కార్తీకి జంటగా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రష్మిక మందన నటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఏప్రిల్ 2న భారీ స్థాయిలో రిలీజైన సంగతి తెలిసిందే. కాగా ఓటీటి ప్లాట్ ఫామ్ డిస్నీ+హాట్ స్టార్ ఈ సినిమా ఈ నెల 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తమిళ, తెలుగు వెర్షన్స్ రెండూ ఓటీటిలో రిలీజ్ కానున్నాయి. ఇక ఓటిటి నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.