అమ్మో.. ఎలుగుబంటి

ABN , First Publish Date - 2021-06-14T05:34:12+05:30 IST

హుస్నాబాద్‌ మండలం పోతారం(ఎస్‌) గ్రామంలో ఆదివారం ఉదయం ఎలుగుబంటి హల్‌చల్‌ చేసింది. నివాస ప్రాంతాల్లోకి రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఉదయం 6 గంటల ప్రాంతంలో ఆవాసాల మధ్య తిరుగుతున్న ఎలుగుబంటిని గ్రామస్థులు గుర్తించారు. ఎలుగుబంటి సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు ఎంతసేపటికీ రాకపోవడంతో యువకులు, రైతులు పటాకులు కాల్చి, చప్పుళ్లు చేస్తూ ఎలుగుబంటిని తరిమేశారు.

అమ్మో.. ఎలుగుబంటి
ఎలుగుబంటిని తరుముతున్న గ్రామస్థులు

హుస్నాబాద్‌ మండలం పోతారం(ఎస్‌)లో హల్‌చల్‌

హుస్నాబాద్‌రూరల్‌, జూన్‌ 13: హుస్నాబాద్‌ మండలం పోతారం(ఎస్‌) గ్రామంలో ఆదివారం ఉదయం ఎలుగుబంటి హల్‌చల్‌ చేసింది. నివాస ప్రాంతాల్లోకి రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.  ఉదయం 6 గంటల ప్రాంతంలో ఆవాసాల మధ్య తిరుగుతున్న ఎలుగుబంటిని గ్రామస్థులు గుర్తించారు. ఎలుగుబంటి సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు ఎంతసేపటికీ రాకపోవడంతో యువకులు, రైతులు పటాకులు కాల్చి, చప్పుళ్లు చేస్తూ ఎలుగుబంటిని తరిమేశారు. దీంతో గ్రామంలో కొన్నిగంటలపాటు కోలాహలం నెలకొన్నది. ఎలుగుబంటి ఒకచోటి నుంచి మరోచోటికి పరుగులు పెట్టగా యువకులు కర్రలు పట్టుకుని దానివెంటనే పరిగెత్తారు. ఎట్టకేలకు ఎలుగు ఊరి పొలిమేరలు దాటిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. సకాలంలో స్పందించని అటవీశాఖ అధికారుల తీరుపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-06-14T05:34:12+05:30 IST