Abn logo
Sep 22 2021 @ 16:36PM

‘చెప్పులు మోయాల్సిందే’ వ్యాఖ్యలపై ఉమా భారతి క్షమాపణ

భోపాల్‌: అధికారులు తమ చెప్పులు మోయడానికి తప్ప ఎందుకూ పనికిరారని చేసిన వ్యాఖ్యలపై ఉమా భారతి పశ్చాతాపం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలు తనను ఎంతగానో బాధించాయని, తన భాష మార్చుకుంటానని, మెరుగు పరుచుకుంటానని ఆమె పేర్కొన్నారు. ఉమా భారతి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెవి అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు అంటూ విమర్శించారు. కాగా, తన వ్యాఖ్యలపై క్షమాపణ కోరుతూ దిగ్విజయ్ సింగ్‌కు రాసిన లేఖ రాశారు.


‘‘నా వ్యాఖ్యలు నన్నే తీవ్రంగా బాధించాయి. మీరు మితమైన భాషను ఉపయోగించవద్దని నేను మీకు (దిగ్విజయ్) పదేపదే చెప్పేదానిని. అలాంటిది నేనే చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశాను. తప్పనిసరిగా నా భాషను మెరుగుపరుచుకుంటాను. అదే సమయంలో మీరు కూడా ఇదే చేయాలి’’ అని దిగ్విజయ్‌ సింగ్‌కి రాసిన లేఖలో ఉమా భారతి రాసుకొచ్చారు.


ఆదివారం కులాల ఆధారంగా జనగణన చేయాలన్న డిమాండ్‌తో తనను కలిసిన స్థానిక ఓబీసీ నాయకుల బృందంతో ఉమా భారతి మాట్లాడుతూ నాయకులు.. అధికారులు చెప్పినట్లు నడుచుకుంటారని అనుకుంటున్నారా? కానే కాదు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ముందుగా మేం చర్చించుకుంటాం. ఆ తర్వాత వాళ్లు ఫైల్‌ సిద్ధం చేస్తారు. అంతేగానీ, వాళ్లు మమ్మల్ని కంట్రోల్‌ చేయడమేంటి? అసలు వాళ్ల సామర్థ్యం ఎంత? పోస్టింగులు, జీతాలు ఇచ్చేది మేమే. ప్రమోషన్లయినా, డిమోషన్లయినా మేమే ఇవ్వాలి. వాళ్లేం చేస్తారు? మా చెప్పులు మోయడానికి మాత్రమే వాళ్లను అనుమతిస్తాం. నిజం ఏంటంటే.. మా రాజకీయాలకు మేమే వాళ్లను వాడుకుంటాం’’ అని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతే కాకుండా దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి.

ఇవి కూడా చదవండిImage Caption