Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 10 2021 @ 20:45PM

వేధింపులు భరించలేక బాలిక ఆత్మహత్యాయత్నం

ఖమ్మం: తన గ్రామానికే చెందిన పోకిరీ వేధింపులు భరించలేక ఓ బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఖమ్మం రూరల్ మండలంలోని వెంకటగిరిలో బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. చికిత్స నిమత్తం బాలికను కుటుంబసభ్యులు ఆస్పత్రకి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. అదే గ్రామానికి చెందిన సాయి అనే యువకుడు ప్రేమ పేరుతో వేధించడంతోనే కూతురు ఆత్మహత్య చేసుకుందని బాలిక తల్లిదండ్రులు  ఖమ్మం రూరల్ పీఎస్‌లో ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Advertisement
Advertisement