కాంట్రాక్ట్‌ ఉద్యోగికి రీ పోస్టింగ్‌ ఇవ్వాలి

ABN , First Publish Date - 2021-01-21T06:02:49+05:30 IST

కాకినాడ, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు హెల్త్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తూ 2018లో ప్రమాదానికి గురైన బి.యోహానును తిరిగి విధుల్లోకి తీసుకోవడంలో అధికారులు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని యునైటెడ్‌ మెడికల్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూ

కాంట్రాక్ట్‌ ఉద్యోగికి రీ పోస్టింగ్‌ ఇవ్వాలి
డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద దీక్ష చేస్తున్న దృశ్యం

యునైటెడ్‌ మెడికల్‌ హెల్త్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు

కాకినాడ, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు హెల్త్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తూ 2018లో ప్రమాదానికి గురైన బి.యోహానును తిరిగి విధుల్లోకి తీసుకోవడంలో అధికారులు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని యునైటెడ్‌ మెడికల్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలివెల శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అతడికి రి పోస్టింగ్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బాధితుడితో పాటు కుటుంబ సభ్యులు, యూనియన్‌ నాయకులు బుధవారం డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు రత్నరాజు మాట్లాడుతూ 2006లో కాంట్రాక్ట్‌ హెల్త్‌ అసిస్టెంట్‌గా చేరిన యోహాను మారేడుమిల్లి మండలంలో పనిచేస్తూ విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదంలో కుడికాలు పోగొట్టుకున్నాడన్నారు. దీంతో తోటి ఉద్యోగులు విరాళాలు సేకరించి రూ.5 లక్షలు అతడి కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారన్నారు. ప్రభుత్వం నుంచి నయా పైసా పరిహారం అందలేదన్నారు. కోలుకున్న యోహాను ఏడాది నుంచి తన ఉద్యోగం ఇవ్వాలని డీఎంహెచ్‌వో కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని తెలిపారు. 14 ఏళ్లు సేవలందించిన ఉద్యోగితో ఈ శాఖ చెలగాటమాడుతోందని ఆయన విమర్శించారు.

Updated Date - 2021-01-21T06:02:49+05:30 IST