Abn logo
Sep 26 2021 @ 02:20AM

‘సీల్డ్‌ కవర్‌’ ఏకగ్రీవాలు

  • మహిళలకు ఏడు జడ్పీ పీఠాలు 
  • వైస్‌ చైర్‌పర్సన్‌గానూ అవకాశం
  • ప్రకాశం జిల్లా మొత్తం ‘ఆమె’కే
  • వైసీపీ వ్యూహాత్మక ‘ఏకగ్రీవం’
  • కడప జడ్పీ పీఠం ఆకేపాటికే
  • పరిషత్‌లలో పాలన షురూ
  • దుగ్గిరాలలో సేమ్‌ సీన్‌.. ఎస్‌ఈసీదే నిర్ణయం


(ఆంధ్రజ్యోతి-న్యూస్‌ నెట్‌వర్క్‌) 

రాష్ట్రంలో మండల పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్షు లు, కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక, అదేవిధంగా జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌, ఇద్దరు వైస్‌ చైర్‌పర్సన్‌లు, కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక ప్రక్రియ ముగిసింది. 24న మండల, 25న జిల్లా పరిషత్‌ ప్రజాప్రతినిధులను ఎన్నుకున్నారు. దీంతో స్థానికసంస్థలకు సం బంధించిన ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. సభ్యు లు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఐదేళ్లపాటు పాలన సాగిస్తారు. కాగా, ఏడు జడ్పీ చైర్మ న్‌ పదవులను మహిళలకే కేటాయించడం గమనా ర్హం. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో జడ్పీ చైర్‌ పర్స న్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ పీఠాలు మహిళలకే దక్కాయి. ఇదిలావుంటే, వైసీపీ అధిష్ఠానం వ్యూహాత్మకంగా వ్యవహరించి వివాదం రాకుండా ‘ఏకగ్రీవాలు’ చేసుకుంది. వివాదాస్పద జిల్లాల్లో జడ్పీ చైర్మన్‌, చైర్‌ పర్సన్‌ల పేర్లను సీల్డ్‌ కవర్‌లలో సంబంధిత జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రులే తీసుకువచ్చారు. వీరితో జిల్లాల కలెక్టర్లు ప్రమాణ స్వీకారం చేయించారు.


మహిళా చైర్‌పర్సన్లు వీరే..

గుంటూరు: గుంటూరు జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా కత్తెర హెన్రీ క్రిస్టినా, వైస్‌ చైర్మన్‌లుగా ఎస్‌. నర్సిరెడ్డి, బత్తుల అనురాధ, కోఆప్షన్‌ సభ్యులుగా హష్మి, స్వెనోమ్‌లు ఎన్నికయ్యారు. 

అనంతపురం: అనంతపురం జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా బోయ గిరిజమ్మ, వైస్‌ చైర్మన్లుగా సుధాకర్‌రెడ్డి, నాగరత్నమ్మ ఎన్నికయ్యారు. కో-ఆప్షన్‌ సభ్యులుగా ఏహెచ్‌ బాషా, ఫయాజ్‌ అలీలను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు.  


విశాఖ: విశాఖ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా జల్లుపల్లి సుభద్ర(ఆదిమ గిరిజన), వైస్‌ చైర్మన్లుగా తుంపాల అప్పారావు, భీశెట్టి వరహా సత్యవతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కో-ఆప్షన్‌ సభ్యులుగా శివసత్యనారాయణ జోసెఫ్‌, ఎన్‌కేవీవీఎ్‌స నారాయణ ఎన్నికయ్యారు.  


శ్రీకాకుళం: శ్రీకాకుళం జడ్పీ చైర్‌పర్సన్‌గా పిరియా విజయ, వైస్‌ చైర్‌పర్సన్‌లుగా సిరిపురపు జగన్మోహన్‌రావు, పాలిన శ్రావణిలను ఎన్నుకున్నా రు. కోఆప్షన్‌ సభ్యులుగా సవర లక్ష్మి, షేక్‌ బాబ్జిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  


నెల్లూరు: నెల్లూరు జడ్పీ చైర్‌పర్సన్‌గా ఆనం అరుణమ్మ, వైస్‌ చైర్‌పర్సన్‌లుగా శ్రీహరికోట జయలక్ష్మమ్మ, చిగురుపాటి పసన్నలను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. కో-ఆప్షన్‌ సభ్యులుగా అల్లాబక్షు, షేక్‌ గాజుల్లా తాజుద్దీన్‌లను ఎన్నుకున్నారు. 


కృష్ణా: కృష్టా జడ్పీ చైర్‌పర్సన్‌గా ఉప్పాల హారిక, వైస్‌ చైర్‌పర్సన్‌లుగా గుదిమళ్ల కృష్ణంరాజు, గరికపాటి శ్రీదేవి ఎన్నికయ్యారు. జెడ్పీ కో-ఆప్షన్‌ సభ్యులుగా వేమూరి పరిశుద్ధరాజు, మహ్మద్‌గౌ్‌సలను ఎన్నుకున్నారు.  


ప్రకాశం: ప్రకాశం జడ్పీ చైర్‌పర్సన్‌గా బూచేపల్లి వెంకాయమ్మ, వైస్‌ చైర్‌పర్సన్లుగా యానాబత్తిన అరుణ, చుండి సుజ్ఞానమ్మలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోఆప్షన్‌ సభ్యులుగా సాబీర్‌ బాషా సయ్యద్‌, షేక్‌ ఆదాం షరీఫ్‌ ఎన్నికయ్యారు.  


6 జిల్లాల్లో పురుష చైర్మన్లు

తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా విప్పర్తి వేణుగోపాల్‌ ఎన్నికయ్యారు. వైస్‌ చైౖర్మన్‌లుగా బుర్రా అనుబాబు, మేరుగు పద్మలత  ప్రమాణ స్వీకారం చేశారు. రెండు జడ్పీ వైస్‌ చైర్మన్‌ పోస్టుల్లో ఒకటి బీసీ కేటగిరిలో శెట్టిబలిజ సామాజికవర్గానికి ఇస్తామని అధిష్ఠానం హా మీ ఇచ్చి, మాట తప్పిందని.. కాపు, మత్స్యకార సామాజిక వర్గాలకే కేటాయించి అన్యాయం చేసిందని కొందరు సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు.  


కర్నూలు: కర్నూలు జడ్పీ చైర్మన్‌గా మల్కిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, వైస్‌ చైర్మన్‌లుగా దిల్షాద్‌నాయక్‌, కురువ బుజ్జమ్మ ఎన్నికయ్యారు.  


విజయనగరం: విజయనగరం జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా మజ్జి శ్రీనివాసరావు, వైస్‌ చైర్మన్‌లుగా మరిశర్ల బాపూజీ నాయుడు, అంబటి వెంకట అనీల్‌కుమార్‌లను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.   


కడప: జడ్పీ చైర్మన్‌గా ఆకేపాటి అమరనాథరె డ్డి,వైస్‌చైర్మన్లుగా శారద, బాలయ్య ఎన్నికయ్యారు.  


చిత్తూరు: జడ్పీ చైర్మన్‌గా శ్రీనివాసులు, వైస్‌ చైర్మన్‌లుగా ధనుంజయరెడ్డి, రమ్య ఎన్నికయ్యారు. 


పశ్చిమ: పశ్చిమగోదావరి జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా కవురు శ్రీనివాస్‌, వైస్‌ చైర్మన్లుగా పోసిన శ్రీలేఖ, పెనుమాల విజయబాబు, కో ఆప్షన్‌ సభ్యులుగా తేరా జాషువా, హబీబుద్దీన్‌ ఎన్నికయ్యారు. 


దుగ్గిరాలలో అదే తీరు!

ఎన్నిక వాయిదా వేసిన అధికారి

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండల పరిషత్‌ చైర్మన్‌ ఎన్నిక రెండో రోజూ వాయిదా పడింది. మొత్తం 18 మంది ఎంపీటీసీలకుగాను టీడీపీ మద్దతుదారులు 9 మంది, జనసేన తరఫున ఒకరు, వైసీపీ సభ్యులు 8 మంది విజయం సాధించారు. అయితే.. శుక్రవారం, శనివారం చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియకు టీడీపీ, జనసేన సభ్యులెవ్వరూ హాజరు కాలేదు. దీంతో కోరం లేక ఎన్నికను వాయిదా వేశారు. శనివారం కూడా సాయం త్రం 4 గంటల వరకు టీడీపీ, జనసేన సభ్యులెవ్వరూ రాలేదు. దీంతో ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన ఆర్వో కె. రామ్‌ప్రసన్న, ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకువెళతామని చెప్పారు. తదుపరి ఎన్నిక ఎప్పుడు నిర్వహించేది ఎస్‌ఈసీ నిర్ణయిస్తుందని తెలిపారు. 
జడ్పీటీసీ @ 85

కడప జిల్లా పరిషత్‌ సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. గాలివీడు జడ్పీటీసీ సభ్యురాలు షేక్‌ భాను బీ(85) వృద్ధురాలు కావడంతో ఆమె స్వయంగా నడిచి సమావేశ మందిరంలోకి రాలేక పోయారు. దీంతో కొందరు ఆమెను పట్టుకుని సమావేశమందిరంలోకి తీసుకువచ్చారు. ఇక, ప్రమాణస్వీకారం సందర్భంగా ప్రమాణ పత్రంలోని తెలుగు పదాలను చదవలేక ఇబ్బంది పడ్డారు. ఈ సందర్భంగా తాను ఉర్దూలో చెబుతానని కలెక్టర్‌ విజయరామరాజుకు తెలిపి, ఆ మేరకు ప్రమాణ స్వీకారం చేశారు.