Abn logo
Oct 15 2021 @ 00:56AM

అనుమతి లేని స్కూళ్లను రద్దు చేయాలి

వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

అనంతపురం విద్య, అక్టోబరు 14:  జిల్లావ్యాప్తంగా అనుమతిలేని స్కూ ళ్లను రద్దు చేయాలని ఏఐఎ్‌సఎఫ్‌ నాయకులు.. విద్యాశాఖాధికారులను కోరారు. గురువారం ఆ సంఘం నా యకులు.. డీఈఓ కార్యాలయంలో సూపరింటెండెంట్‌ శ్రీనాథ్‌ను కలిశారు. ఆ సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి మ నోహర్‌ మాట్లాడుతూ... జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న స్కూళ్లపై చర్యలు తీసుకోవాలన్నారు. కార్పొరేట్‌ స్కూళ్లు ధనార్జనే ధ్యేయంగా లక్షల రూపాయల ఫీజులు తల్లిదండ్రుల నుంచి గుంజుతున్నాయన్నారు. డీఈఓ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉండే పాఠశాలల్లోనే దోపిడీ సాగుతున్నా.. డీఈఓ కనీస పర్యవేక్షణ చేయకపోవడం  దారుణమన్నారు. విద్యా దోపిడీని అరికట్టకపోతే భారీఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు చిరంజీవి, రమణయ్య, హేమంత్‌, మౌలాలీ, రాము పాల్గొన్నారు.