అన్‌బిలీవబుల్‌

ABN , First Publish Date - 2020-10-07T06:31:11+05:30 IST

బాలీవుడ్‌ హీరో టైగర్‌ షరాఫ్‌ డ్యాన్స్‌ చేస్తే ఫ్లోర్‌ అదిరిపోతుంది. యువత జోష్‌ అమాంతం రెట్టింపవుతుంది. మైకేల్‌ జాక్సన్‌ అభిమాని అయిన టైగర్‌...

అన్‌బిలీవబుల్‌

బాలీవుడ్‌ హీరో టైగర్‌ షరాఫ్‌ డ్యాన్స్‌ చేస్తే ఫ్లోర్‌ అదిరిపోతుంది. యువత జోష్‌ అమాంతం రెట్టింపవుతుంది. మైకేల్‌ జాక్సన్‌ అభిమాని అయిన టైగర్‌... అప్పుడప్పుడూ ఆ లెజెండ్‌ను మరిపించే మూమెంట్స్‌తో మురిపిస్తుంటాడు. తాజాగా ఈ స్టార్‌ గళం కూడా విప్పాడు. తానే పాడి... ఆడిన ఆ మ్యూజిక్‌ వీడియోనే... ‘అన్‌బిలీవబుల్‌’. గత నెల 21న యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసిన ఈ వీడియో సాంగ్‌ను ఇప్పటికి 1.98 కోట్ల మంది వీక్షించారు. కొద్దిగా గ్యాపిచ్చి అదే పాటతో మరో వీడియో వదిలాడు. అదీ క్రేజీగా మారిపోయింది. 42.73 లక్షల మంది చూశారు.


‘యూ ఆర్‌ అన్‌బిలీవబుల్‌’ అంటూ అభిమానులు టైగర్‌ షరాఫ్‌కు కితాబులిస్తున్నారు. ఈ వీడియోలో రోబోటిక్స్‌, పాపింగ్‌, లాకింగ్‌... ఇంకా ఎన్నో రకాల డ్యాన్స్‌ మూమెంట్స్‌తో అలరించాడీ హీరో. అందుకే బాలీవుడ్‌ ప్రముఖులకూ ఇది తెగ నచ్చేసింది. మొత్తానికి తనలోని మరో కళాకారుడిని తట్టి లేపడానికి ఈ లాక్‌డౌన్‌ ఉపయోగపడిందంటాడు టైగర్‌. 

Updated Date - 2020-10-07T06:31:11+05:30 IST