పేదింటి ఆడబిడ్డల మేనమామ కేసీఆర్‌

ABN , First Publish Date - 2020-09-25T06:59:14+05:30 IST

పేదింటి ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్‌ మేనమామ పాత్ర పోషిస్తున్నారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు

పేదింటి ఆడబిడ్డల మేనమామ కేసీఆర్‌

ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి


కృష్ణకాలనీ, సెప్టెంబరు 24: పేదింటి ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్‌ మేనమామ పాత్ర పోషిస్తున్నారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ పథకాలతో వారిని ఆదుకుంటున్నారని కొనియాడారు. జిల్లా కేం ద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం భూపాలపల్లి, గణపురం మండలాలకు చెందిన 171 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయని సాహసోపేత నిర్ణయాలు కేసీఆర్‌ తీసుకుంటున్నారని, దీంతో అన్ని వర్గాల ప్రజ లు ఆనందంగా ఉంటున్నారని అన్నారు. నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకురావడంతో పాటు రైతుబం ధు, రైతుబీమా, రుణమాఫీ వంటి పథకాల ద్వారా అన్నదాతలకు ఆసరాగా నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ కళ్లెపు శోభ, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ సెగ్గం వెంకటరాణి, వైస్‌ చైర్మ న్‌ హరిబాబు, పీఏసీఎస్‌ చైర్మన్లు మేకల సంపత్‌యాదవ్‌, పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


భూనిర్వాసితులకు పరిహారం చెల్లించాలి

కాకతీయఖని : ఓపెన్‌కాస్టు ప్రాజెక్ట్‌-2లో భూము లు కోల్పోయిన వారికి వెంటనే పరిహారం చెల్లించాల ని ఏరియా సింగరేణి అధికారులను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆదేశించారు. తన క్యాంపు కార్యా లయంలో ఆయన సింగరేణి అధికారులతో గురువా రం సమావేశమయ్యారు. ఓపెన్‌కాస్టు ప్రాజెక్ట్‌-2 కింద ఫక్కీరుగడ్డ, ఆకుదారివాడకు చెందిన రైతులు తమ భూములను, ఇళ్లను కోల్పోయారన్నారు. వెంటనే సర్వే నిర్వహించి వారికి పరిహారం చెల్లించాలని అన్నారు. సమావేశంలో సింగరేణి ఏరియా జనరల్‌ మేనేజర్‌ నిరీక్షణ్‌రాజ్‌ తదితర  అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-25T06:59:14+05:30 IST