పాత జీతాలే చాలు అంటూ ఉద్యోగ సంఘాలు సమ్మెకు దిగిన పరిస్థితి ఎప్పుడూ చూడలేదు: ఉండవల్లి

ABN , First Publish Date - 2022-01-24T17:36:19+05:30 IST

పాత జీతాలే చాలు అంటూ ఉద్యోగ సంఘాలు సమ్మెకు దిగిన పరిస్థితి ఎప్పుడూ చూడలేదని ఉండవల్లి అన్నారు.

పాత జీతాలే చాలు అంటూ ఉద్యోగ సంఘాలు సమ్మెకు దిగిన పరిస్థితి ఎప్పుడూ చూడలేదు: ఉండవల్లి

రాజమండ్రి: కొత్త పీఆర్సీ అమలు చేయటం వల్ల రూ. 10,247 కోట్లు అదనపు భారం పడుతుందని ప్రభుత్వం చెబుతుంటే.. పెంచిన జీతాలు వద్దు పాత జీతాలే చాలు అంటూ ఉద్యోగ సంఘాలు సమ్మెకు దిగిన పరిస్థితి ఎప్పుడూ చూడలేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. పీఆర్సీ కోసం ఉద్యోగ సంఘాలు చేపట్టిన ఉద్యమంపై స్పందించిన ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనా బీభత్సం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక దుస్థితిని దృష్టిలో పెట్టుకొని సమ్మెను ఆపవల్సిందిగా ప్రార్థిస్తున్నానని అన్నారు. ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు పట్టింపులకు పోకుండా చర్చలు ద్వారా సమస్యకు పరిష్కరం సాధించాల్సిందిగా కోరుతున్నానన్నారు.

Updated Date - 2022-01-24T17:36:19+05:30 IST