Abn logo
Mar 26 2020 @ 08:09AM

కేసీఆర్, జగన్ అద్భుతంగా పనిచేస్తున్నారు: ఉండవల్లి

రాజమండ్రి : కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలు ఇళ్లలో కూర్చుని దేశభక్తిని నిరూపించుకోవాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్ పిలుపునిచ్చారు. ఇవాళ ఉదయం మీడియాతోమాట్లాడిన ఆయన.. కరోనాను భారత్ అధిగమిస్తే ప్రపంచంలో మూడో స్థానంలోకి చేరతామన్నారు.


ఈ క్లిష్ట సమయంలో దేశాన్ని కాపాడగలిగే వ్యక్తి ప్రధాని మోదీ ఒక్కరే అన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అద్భుతంగా పని చేస్తున్నారని ఉండవల్లి కితాబిచ్చారు. జగన్ ప్రవేశపెట్టిన గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ప్రయోజనకరం అవుతోందన్నారు. ప్రభుత్వాలకు  ప్రజలు  సహకరించాలని ఆయన సూచించారు. అదే విధంగా ముఖ్యమంత్రి, మంత్రులు  కరోనా పాజిటివ్ కేసు బాధితులతో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పాలని ఆయన సూచించారు. కాగా.. రాజమండ్రిలోని కరోనా పాజిటివ్ బాధితుని కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడిన ఉండవల్లి ధైర్యం చెప్పారు.

Advertisement
Advertisement
Advertisement