Abn logo
Sep 26 2021 @ 23:50PM

కూలిన గోపురం పనులు చేపట్టాలి

కూలిన గోపుర ప్రాంతంలో రమేష్‌ తదితరులు

శ్రీకాళహస్తి, సెప్టెంబరు 26: వెయ్యిలింగాల కోనలోని మొదటి కొండ పైభాగంలో కూలిన గోపురం పనులు చేపట్టాలని హిందూ ధార్మికమండలి పట్టణ కన్వీనర్‌ గరికపాటి రమే్‌షబాబు కోరారు. ఆదివారం ఆయన ధార్మిక మండలి సభ్యులతో కలసి శ్రీకాళహస్తీశ్వరాలయ సమీపంలోని వెయ్యిలింగాలకోనను సందర్శించారు. ఏటా కనుమ రోజు, ముక్కంటి శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో జరిగే గిరిప్రదక్షిణకు అధికసంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారన్నారు. ఆ సమయంలో వెయ్యిలింగాల కోనకు గుర్తుగా గోపురం దర్శనమిచ్చేదని చెప్పారు. ఇది కూలిపోయి ఎనిమిదేళ్లయిందనీ, ముక్కంటి ఆలయ అధికారులు స్పందించి గోపుర నిర్మాణం చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో వాసుయాదవ్‌, వెంకటేష్‌ ఆచారి, జొన్నలగడ్డ మురళి, దిలీప్‌, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.