Kolkata హుగ్లీ నది నీటి అడుగున మెట్రోరైలు కోసం సొరంగం...దేశంలోనే ప్రథమం

ABN , First Publish Date - 2022-04-07T16:44:34+05:30 IST

దేశంలోనే మొట్టమొదటిసారి కోల్‌కతా నగరంలోని హుగ్లీ నది అడుగున మెట్రోరైలు మార్గం కోసం సొరంగం నిర్మాణం చేపట్టారు.

Kolkata హుగ్లీ నది నీటి అడుగున మెట్రోరైలు కోసం సొరంగం...దేశంలోనే ప్రథమం

కోల్‌కతా: దేశంలోనే మొట్టమొదటిసారి కోల్‌కతా నగరంలోని హుగ్లీ నది అడుగున మెట్రోరైలు మార్గం కోసం సొరంగం నిర్మాణం చేపట్టారు.హౌరా-  కోల్‌కతా నగరాల మధ్య మెట్రో కనెక్టివిటీని నెలకొల్పడానికి హుగ్లీ నది కింద నీటి అడుగున సొరంగం నిర్మాణం జరుగుతోంది. ఈ సొరంగం నిర్మాణం 2023 నాటికి పూర్తి కానుంది.తూర్పు-పశ్చిమ ప్రాంతంలో 16.6 కిలోమీటర్ల పొడవులో, 520 మీటర్ల నదీ గర్భం కింద ఈ సొరంగాన్ని నిర్మిస్తున్నారు. టన్నెల్ కారిడార్ నదీ గర్భానికి 33 మీటర్ల దిగువన నిర్మించారు.ఈ సొరంగ మార్గం కోల్‌కతా నుంచి హౌరాను కలుపుతుంది.ఈ సొరంగ మార్గాన్ని కోల్‌కతా ఈస్ట్-వెస్ట్ మెట్రో లైన్‌ను కోల్‌కతా మెట్రో రైల్ కార్పొరేషన్ నిర్మిస్తోంది. 


అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణీకులను తరలించడానికి సొరంగాలలో నడక మార్గాలు ఉంటాయని సైట్ సూపర్‌వైజర్ మిథున్ ఘోష్ చెప్పారు. వాటర్ టన్నెల్ ప్రాంతంలో సాంకేతిక సమస్య తలెత్తితే ప్రత్యేక మార్గం ద్వారా ప్రయాణికులను బయటకు తీసుకెళ్లవచ్చని మిథున్ చెప్పారు. ఈస్ట్‌-వెస్ట్‌ హౌరా మెట్రో స్టేషన్‌లో 80 శాతం పనులు పూర్తయ్యాయని, 2023 నుంచి పూర్తి స్థాయి సర్వీసు ప్రారంభమయ్యే అవకాశం ఉందని మిథున్ వివరించారు. 33 మీటర్ల లోతులో హుగ్లీ నది కింద మెట్రో స్టేషన్‌ను నిర్మిస్తున్నారు. 

Updated Date - 2022-04-07T16:44:34+05:30 IST