పల్లెల్లో పత్తాలేని ఏఈవోలు

ABN , First Publish Date - 2021-07-31T05:58:16+05:30 IST

జగిత్యాల జిల్లా వ్యవసాయ శాఖ కు నిర్లక్ష్యపు గ్రహణం పట్టింది.

పల్లెల్లో పత్తాలేని ఏఈవోలు
జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయం

సాగు నివేదికలు, ఆన్‌లైన్‌ నమోదుకే పరిమితం

 రైతులకు అవగాహన కల్పించడంలో వ్యవసాయ శాఖ విఫలం 

జగిత్యాల, జూలై 30 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల జిల్లా వ్యవసాయ శాఖ కు నిర్లక్ష్యపు గ్రహణం పట్టింది. రైతులకు అవసరమైన సేవలు అందిం చడంలో జిల్లా వ్యవసాయ శాఖ, అధికారులు పూర్తిగా విఫలం అవుతున్నారు. వానాకాలం సీజన్‌ ఆరంభమయ్యి నెలన్నర రోజులు గడుస్తు న్నా, పల్లెల్లో వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈవో)లు పత్తాలేరనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం సాగు నివేదికలను ఆన్‌లైన్‌లో న మోదు చేసేందుకే తప్ప, రైతులకు సాగులో మెళకువలు వివరించడంలో, సలహాలు సూచనలు అందించడంలో నిర్లక్ష్యం కనబరుస్తున్నార ని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రత్నామ్నాయ పంటల పై అవగాహన లేని రైతులు వరి సాగు వైపే దృష్టి సారిస్తున్నారని రైతు సంఘాల నేతలు అంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే వరి పం ట తప్ప మరో ప్రత్యామ్నాయ పంటలకు జిల్లాలో అవకాశం లేకుండా పోతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


జిల్లాలో 3.65 లక్షల ఎకరాల్లో సాగు....

జగిత్యాల జిల్లాలోని 18 మండలాల్లో గల 380 గ్రామాల్లో ప్రస్తుత వానాకాలం సీజన్‌లో సుమారు 3.65 లక్షల ఎకరాల్లో పంటల సాగు అ వుతోంది. ఇందులో ప్రధానంగా 2.83 లక్షల ఎకరాల్లో వరి సాగు, 31 వేల ఎకరాల్లో పత్తి సాగు, 15 వేల ఎకరాల్లో కంది, 31 వేల ఎకరాల్లో మొక్క జొన్న, 2,500 ఎకరాల్లో పెసర, 2,500 ఎకరాల్లో ఇతర పంటలు సాగవు తున్నాయి. వీటికి అదనంగా సుమారు 2 లక్షల ఎకరాల్లో వివిధ రకాల ఉద్యానపంటలను అన్నదాతలు సాగు చేస్తున్నారు.


ఏఈవోల జాడేది ? 

పల్లెల్లో రైతుల మధ్య ఉంటూ రైతులకు అవసరమైన సలహాలు, సూ చనలు అందించేందుకు క్లస్టర్‌ (5000ల ఎకరాలకు)కు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని ప్రభుత్వం నియమించింది. వీరి ద్వారా గ్రామాల్లోని రైతులకు మరిన్ని మెరుగైన సేవలు అందించవచ్చునని ప్రభుత్వం భా వించింది. జగిత్యాల జిల్లాలో 72 క్లస్టర్‌లను గుర్తించి, 72మంది ఏఈవో లను నియమించింది. రాష్ట్ర ప్రభుత్వం. రైతులకు విలువైన సలహాలు, సూచనలు అందించేందుకు రైతు వేదికలను సైతం నిర్మాణం చేసింది. కానీ ప్రభుత్వ ఆలోచనకు పూర్తి భిన్నంగా క్షేత్రస్థాయిలో ఏ ఈవోలు వ్య వహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. కేవలం పంటల సాగు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తూ, మిగతా విషయాలను గాలికి వదిలేస్తున్నా రని, అసలు కొందరు ఏఈవోలు అయితే గ్రామాల్లోకి కూడా రావడం లే దని అధికార పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉంటే త మకు సంబంధం లేని పనులు తమతో చేయిస్తున్నారని, తాము కేవలం ఆపరేటర్‌లుగా మారామని, చదివిన చదువుకు, చేసే వృత్తికి క్షేత్రస్ధాయిలో సంబంధం లేకుండా పోతోందని పలువురు ఏఈఓ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పల్లెల్లో రైతులతో మమేకమవుతూ విలువైన సలహాలు సూచనలు ఇస్తూ విధులు నిర్వహించాల్సిన ఏఈవోలు ఆ దిశగా ప్రయత్నం చేయడం లేదు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకే తాము ఈ విధులు నిర్వహిస్తున్నామని వారు పేర్కొంటున్నారు. దీంతో రైతులకు సాగు విషయంలో మెళకువలు తెలియక సాంప్రదాయ పంటల వైపే రైతులు ముందుకు సాగుతున్నారు. ఆఽధునిక సాగువైపు అడుగు వే యలేక, ప్రత్నామ్నాయ పంటలపై అవగాహన లేక రైతులు ఇక్కట్ల పా లవుతున్నారు.


పల్లెల్లో పంటల నమోదు, సర్వేలు నామమ్రాతమే.....

భారీ వర్షాల కారణంగా నష్టపోయిన గ్రామాలు, రైతుల వద్దకు వెళ్లి నష్టం అంచనా వేయడం, లేదా వానా కాలం సీజన్‌ ఆరంభంలో చేపట్టే పంటల నమోదు ప్రక్రియలో క్షేత్రస్థాయిలో ఏఈవోలు పర్యటించడం లేదన్న విమర్శలున్నాయి కేవలం నామమాత్రంగా గ్రామాల్లోకి క్రాప్‌ బుకింగ్‌ నమోదు పుస్తకాలను గ్రామాల్లోని కొందరు యువకులకు ఇచ్చి, వాళ్లద్వారానే ఫోన్‌లు చేయిస్తూ పంటల నమోదు ప్రక్రియను తూతూమంత్రంగా నిర్వహిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. స దరు యువకులు సైతం ఆ బుక్కును పట్టుకుని గ్రామంలో ఓ చోట కూర్చొని సామాజిక మాధ్యమాల్లో మెసెజ్‌ పెడుతూ పంటల వివరాలు నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు. దీనికి తోడు మరికొంత మంది ఏఈవోలు గ్రామంలోని ముఖ్య నేతలను మచ్చిక చేసుకుని, గ్రామ పం చాయతీ కార్యాలయాల ఆవరణలో, లేదా గ్రామంలోని జనాలు గుమిగూడే ప్రాంతాల్లో వేదిక ఏర్పాటు చేసుకుని వివరాలు నమోదు చేసుకుంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు చాలా మంది రైతుల పంట పొలాల్లోకి నీళ్లు వచ్చి నష్టం వాటిల్లగా, వ్యవసాయ శాఖ అధికారులు నామమాత్రంగా సర్వేలు చేపట్టారన్న విమర్శలున్నాయి. గతంలో కూడా ఇలా గే తమకు నచ్చిన విధంగా పంటల నమోదు, పంటల నష్టం అంచనా లు వేశారని రైతులు మండిపడుతున్నారు. పల్లె ముంగిట్లోకి వచ్చి రైతులకు విలువైన సలహాలు సూచనలు చేయాల్సిన వ్యవసాయ అధికారులు, రైతుల్లో అవగాహన కల్పించేందుకు పల్లెల్లోకి రాలేదని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. రైతు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసినా కేవలం పలు పల్లెల్లో భూసార పరీక్షలు గానీ, సేంద్రీయ ఎరువుల వాడకంపైగానీ, నూతన యాజమాన్య సాగు విధానంపై గానీ, ఎరువుల వా డకం, ప్రత్నామ్నాయ పంటల సాగు తదితర విషయాలపై ఎలాంటి అ వగాహన కల్పించలేదని రైతులు ఆరోపిస్తున్నారు. 

Updated Date - 2021-07-31T05:58:16+05:30 IST