Advertisement
Advertisement
Abn logo
Advertisement

చదివింది కేవలం నాలుగో తరగతి.. సాఫ్టవేర్ సహాయంతో ఖరీదైన కార్లు దొంగతనం.. పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన ఖిలాడీ

కొన్ని సంవత్సరాలుగా దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో ఖరీదైన లగ్జరీ కార్ల దొంగతనాలు జరుగుతున్నాయి. ఈ దొంగతనాలు గత కొంత కాలంగా మధ్యప్రదేశ్‌లో జరుగుతున్నాయి. దొంగలొంచబడిన కార్లను సగం రేట్లకే మరో రాష్ట్రంలో విక్రయించేవారు. పోలీసులకు ఈ లగ్జరీ కార్ల వెనుక రాజస్థాన్‌కు చెందిన ఒక ముఠా ఉందని సమాచారం అందింది. కానీ ఆ ముఠాను పట్టుకోవడానకి వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలో పోలీసులకు అనుకోకుండా ఒక కారు దొంగతనం ఫిర్యాదు అందింది. ఆ కారు దొంగలించబడి ఒక గంట కూడా కాలేదని తెలియడంతో వారు హుటాహుటిన చుట్టుపక్కల నగరాలలో చెక్‌పోస్టుల వద్ద తనిఖీ నిర్వహించారు. దీంతో అతికష్టం మీద ఆ ముఠాలోని ఒక దొంగను పట్టుకున్నారు. పోలీసులు ఆ పట్టుబడిన దొంగను తమ పద్ధతిలో ప్రశ్నించగా.. అతడు తన ముఠా గురించి, దొంగతనాలు చేసే విధానం గురించి చెప్పాడు.


పోలీసుల కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని ప్రధాన నగరం ఇందోర్‌లో ఒక వ్యక్తి తన కారు దొంగలించబడినది ఫిర్యాదు చేశాడు. ఆ వ్యక్తి తన కారులో తన కూతురిని స్కూల్‌కి తీసుకెళ్లగా.. స్కూల్ బయట నుంచి కారు దొంగలించబడినదని అతను తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దొంగతనం జరిగి గంట సమయం కావడంతో.. పోలీసుల బృందం రంగంలో దిగింది. వెంటనే నగర చెక్‌పోస్టుల వద్ద తనిఖీ నిర్వహణ మొదలుపెట్టారు. ఒక టోల్ గేట్ వద్ద సీసీటీవిలో కారు కనిపించడంతో దొంగలు నగరం దాటేశారని తెలిసింది. 


ఇందోర్ పోలీసులు చుట్టుపక్కల నగరాల పోలీసులను సమాచారం అందించారు. కానీ ఇందోర్ దాటగానే దొంగలు కారు నెంబర్ ప్లేట్ మార్చేశారు. దీంతో పోలీసులు ఒక టోల్ గేట్ వద్ద ట్రాఫిక్‌ని నిలిపివేశారు. ఒక్కొక్క కారుని జాగ్రత్తగా పరిశీలుస్తుండగా.. దొంగలు కారుని రోడ్డుపైనే వదిలేసి పారిపోయి సమీపంలోని ఒక గ్రామంలో దాకున్నారు. పోలీసుల గ్రామస్తుల సహాయంతో వెతకడం ప్రారంభించారు. గ్రామంలోని ఒక ఎత్తైన భవనంపై పోలీసులు ఎక్కి చూడగా.. ముగ్గురు దొంగలు ఒక పొలంలో దాక్కొని ఉన్నట్లు తెలిసింది. పోలీసులు అక్కడికి చేరుకునేలోగా.. ఇద్దరు దొంగలు తప్పించుకుని పారిపోయారు. దొరికిన ఒక్కదొంగని పోలీసులు తమ పద్ధతిలో విచారణ చేసి.. కీలక సమాచారం రాబట్టారు.


ఈ హైఫై కార్ల దొంగల ముఠాలో మొత్తం ఆరు మంది ఉన్నారని తెలిసింది. వారంతా కేవలం వాట్సప్ కాల్ ద్వారానే మాట్లుడుకునేవారు. దీంతో పోలీసులు వారి ఫోన్ లొకేషన్‌ని ట్రేస్ చేయలేకపోయేవారు. ముఠా మాస్టర్‌మైండ్ పప్పు కేవలం నాలగో తరగతి మాత్రమే చదివాడు.. కానీ అతను వేసే పక్కా ప్లాన్‌తో ఈ మధ్యలోనే 20 కార్లను దొంగలించగలిగారు. పప్పు ఒక కొత్త సాఫ్ట్‌వేర్ ఉపయోగించి కారు సెక్యూరిటీ సిస్టమ్‌ని బ్రేక్ చేసేవాడని ఆ తరువాత ముఠాలోని ఒక నైపుణ్యం గల డ్రైవర్ కారుని సునాయాసంగా తీసుకువచ్చేవాడు. ఈ దొంగలంతా ముందు ఒక కేసులో గుజరాత్‌లో పట్టుబడ్డారని.. వారంతా రాజస్థాన్‌కు చెందిన వారని పోలీసులకు తెలిసింది. దీంతో పోలీసులు రాజస్థాన్‌లోని వారి స్వస్థలాలో నిఘా పెంచారు.


Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement