Abn logo
Oct 17 2021 @ 00:54AM

నిరుద్యోగ భృతి తక్షణమే అమలు చేయాలి

కాంగ్రెస్‌ పార్టీలో చేరిన యువకులతో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

- ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

జగిత్యాల టౌన్‌, అక్టోబరు 16: ఏడేళ్లుగా నూతన ఉద్యోగాలు భర్తీ చేయలేని ప్రభుత్వం ఎన్నికల్లో వాగ్ధానం ఇచ్చిన నిరుద్యోగ భృతి తక్షణమే అమలు చేయాలని పట్టభధ్రుల ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జగిత్యాల రూరల్‌ మండలం పోరండ్ల గ్రామానికి చెందిన 50 మంది యువకులు సర్పంచ్‌ పోగల్ల సంధ్యారాణి శ్రీనివాస్‌ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరగా ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి చేర్చుకుని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో యువకులు కీలక పాత్ర వహిం చారని, అలాంటి యువకులకు ప్రభుత్వం ఉధ్యోగావకా శాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. బిస్వాల్‌ కమిటీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో లక్షా 91 వేల ఉఽధ్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఈ ప్రభుత్వం ఏడేళ్లలో ఎన్ని ఉధ్యోగాలు భర్తీ చేసిందో స్వేత పత్రంతో పాటు నూతన ఉధ్యోగాల కల్సనపై జాబ్‌ క్యాలేండర్‌ విడుదల చేయాలన్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో లక్షకు పైగా పాడి రైతులు ఉన్నార ని, వారిని ప్రోత్సహించే కమిషన్‌ ఇవ్వకుండా పాడి పరివ్రమను దెబ్బతీసేలా సీఎం కేసీఆర్‌ వ్యవహరిస్తు న్నారన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని పదే పదే పబ్లిక్‌ మీటింగ్‌లలో వాగ్ధానం ఇచ్చిన సీఎం కేసీఆర్‌ ఇప్పుడు మాటా మార్చారన్నారు. దళిత భందు కింద రూ. 10 లక్షల లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం ఖర్చు పెట్టుకోకుండా ఫ్రీజింగ్‌ చేశారన్నారు. దళితుల అభివృధ్ది నిధులను పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టకుండా రూ. 35 వేల కోట్లు ల్యాబ్‌ అయ్యేలా చేసిన సీఎం దళితులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. 

హుజూరాబాద్‌కు పరిమితం కాకుండా రాష్ట్రమంతా దళితబంధు అమలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాత్మక విధానాలు అవలంభించడం లేదని అనుసరిస్తున్న వ్యవహారాన్ని చూస్తుంటే రాజకీయాల్లో ఎందుకు ఉన్నామని భాద కలిగిస్తోందన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి యువకులే బలమని రానున్న రోజుల్లో పార్టీ అధి కారంలోకి వచ్చేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బండ శంకర్‌, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు గుండ మధు, కాంగ్రెస్‌ నాయకులు అల్లాల రమేష్‌ రావు, గాజెంగి నందయ్య, దుర్గయ్య, జీవన్‌, రాజేష్‌ తదితరులు ఉన్నారు.