అనూహ్య ఫలితాలొచ్చినా..టీఆర్‌ఎ్‌సకే మేయర్‌ పీఠం!

ABN , First Publish Date - 2020-12-04T08:55:59+05:30 IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌్‌స్‌సకు మెజారిటీ తక్కువ వచ్చినా మేయర్‌ పీఠం మాత్రం ఆ పార్టీకే దక్కే అవకాశాలుంటాయి. గ్రేటర్‌లో మెజారిటీ డివిజన్లను టీఆర్‌ఎస్‌ గెలుచుకుంటుందని ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహించిన

అనూహ్య ఫలితాలొచ్చినా..టీఆర్‌ఎ్‌సకే మేయర్‌ పీఠం!

వందకు పైగా డివిజన్లలో గెలిస్తేనే బీజేపీకి చాన్స్‌

హైదరాబాద్‌, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌్‌స్‌సకు మెజారిటీ తక్కువ వచ్చినా మేయర్‌ పీఠం మాత్రం ఆ పార్టీకే దక్కే అవకాశాలుంటాయి. గ్రేటర్‌లో మెజారిటీ డివిజన్లను టీఆర్‌ఎస్‌ గెలుచుకుంటుందని ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహించిన పలు సంస్థలు వెల్లడించాయి. అయితే అనూహ్య ఫలితాలు వస్తాయని బీజేపీ అంచనా వేస్తోంది. ఆ అంచనానే నిజమై బీజేపీనే ఎక్కువ డివిజన్లలో విజయం సాధించినా మేయర్‌ పీఠం మాత్రం ఆ పార్టీకి దక్కే అవకాశాలు తక్కువ. ఎక్స్‌ అఫీషియోలను కలుపుకొని సుమారు 200 మంది సభ్యులు మేయర్‌ను ఎన్నుకుంటారు. వీరిలో జీహెచ్‌ఎంసీ డివిజన్ల నుంచి ఎన్నికైన వారు 150 మందే ఉంటారు.


ఈ 150 డివిజన్లలో కనీసంగా 40 స్థానాల్లో ఎంఐఎం పాగా వేసినా.. మిగిలిన 110 డివిజన్లలో బీజేపీ, టీఆర్‌ఎస్‌, కాంగ్రె్‌సకు ఎన్ని వస్తాయన్నదీ చూడాలి. అనూహ్య ఫలితాలు వచ్చి బీజేపీకి 90 సీట్లు సాధించినా మేయర్‌ పీఠం దక్కించుకోవడానికి ఆ పార్టీకి 10 మందికి పైగా సభ్యుల మద్దతు కావాల్సి ఉంటుంది. బీజేపీకి అవసరమైన స్థానాలు ఎంఐఎం దగ్గర ఉన్నా.. సైద్ధాంతికంగా ఆ రెండు పార్టీలూ కలిసే ప్రశ్నే ఉండబోదు.


ఇక కాంగ్రెస్‌ నుంచీ అవకాశం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో అనూహ్య పరిస్థితులు ఏర్పడి టీఆర్‌ఎస్‌ రెండో స్థానానికి పరిమితమైనా మేయర్‌ పీఠాన్ని మాత్రం దక్కించుకునే అవకాశాలే ఉంటాయి.

బీజేపీని నిలువరించాల్సిన పరిస్థితి వస్తే టీఆర్‌ఎ్‌సకు ఎంఐఎం బేషరతుగా మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంటుందని పలువురు అంటున్నారు. ఎన్నికల్లో జరిగిన రాజకీయ పోలరైజేషనే ఈ పరిణామానికి తావిచ్చినట్లవుతుందనీ చెబుతున్నారు. బీజేపీ వందకు పైగా డివిజన్లలో గెలిస్తే మాత్రమే మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకోవడం ఖాయమని అంటున్నారు.  


Updated Date - 2020-12-04T08:55:59+05:30 IST