ఏళ్లు గడుస్తున్నా పూర్తికాని పనులు

ABN , First Publish Date - 2021-01-11T05:01:57+05:30 IST

చేర్యాల: కొమురవెల్లిలో మల్లన్న ఆలయం, జగదేవ్‌పూర్‌ మం డలం తిగుల్‌నర్సాపూర్‌లో కొండపోచమ్మ ఆలయాలు తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకలు.

ఏళ్లు గడుస్తున్నా పూర్తికాని పనులు
బీటీరోడ్డుపై ఏర్పడిన గుంతల్లో నిలిచిన వర్షపునీరు

 కొనసాగుతున్న కొమురవెల్లి-కొండపోచమ్మ రోడ్డువిస్తరణ పనులు


 చేర్యాల:  కొమురవెల్లిలో మల్లన్న ఆలయం,  జగదేవ్‌పూర్‌ మం డలం తిగుల్‌నర్సాపూర్‌లో కొండపోచమ్మ ఆలయాలు తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకలు. ఆయా ఆలయాలకు వచ్చే భక్తుల ప్రయాణంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు గతంలో ఉన్న రహదారి విస్తరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జగదేవ్‌పూర్‌ మండలం మునిగడప నుంచి కొండపోచమ్మ మీదుగా కొమురవెల్లి మండలం అయినాపూర్‌ శివారు వరకు కొన్నాళ్లక్రితం రోడ్డువిస్తరణ పనులు చేపట్టారు. కానీ పనుల్లో జాప్యం చోటుచేసుకుంటుండటంతో ఏళ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. ఇక మూడు నెలల పాటు జరి గే మల్లన్న బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు భారీగా తరలివస్తారు. ప్రతీసారి జాతర సమీక్షా సమావేశాల్లో కొమురవెల్లి-కొండపోచమ్మ దారివిస్తరణ, ఆర్టీసీ బస్సుల ఏర్పాటుపై చర్చిస్తున్నా ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం భక్తులకు ఇక్కట్లు తప్పడం లేదు. దారి సరిగా లేక గుంతలు, మూలమలుపులతో ఒళ్లు హూనమవుతుండటంతో భక్తులు ఉసూరుమంటున్నారు. 

Updated Date - 2021-01-11T05:01:57+05:30 IST