నెరవేరని నేత బజారు లక్ష్యం

ABN , First Publish Date - 2022-01-21T05:04:16+05:30 IST

స్థానిక రైల్వేస్టేషన్‌ ఎదురుగా నిర్మించిన నేత బజారు లక్ష్యానికి ఆమడదూరంలో ఉంది.

నెరవేరని నేత బజారు లక్ష్యం
చీరాల నేతబజారు భవన సముదాయం

 ప్రస్తుతం చాలా దుకాణాలు ఖాళీ

ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందితేనే ఆ రంగం కళకళ

చీరాల, జనవరి 20: స్థానిక రైల్వేస్టేషన్‌ ఎదురుగా నిర్మించిన నేత బజారు లక్ష్యానికి ఆమడదూరంలో ఉంది. చేనేత సహకారసంఘాలలో తయారైన వస్త్రాలను విక్రయించేందుకు వీలుగా ఈ నేతబజారు దుకాణసముదాయాన్ని నిర్మించారు. ప్రస్తుతం అందులో సగానికి పైగా దుకాణాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో లక్ష్యం నెరవేరటం లేదు.

చీరాల ప్రాంతంలో మొదట్నుంచీ చేనేత సహకార సంఘాలు ఎక్కువ. రాన్రాను వాటి ప్రాభవం కోల్పోతోంది. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పనిచేసేవి ఏడెనిమిది ఉంటే కాగితాల మీద కనిపించేవి సుమారు 30 సం ఘాలకు పైగా ఉన్నాయి. కొన్ని సంఘాలలో మగ్గాలపై నేసిన వస్త్రాలు ఆప్కోతో పాటు నేరు విక్రయించుకునేందుకు నేతబజారులో దుకాణాలను నిర్మించారు. మొత్తం 16 గదులున్నాయి. ఒక్కో సంఘానికి దుకా ణం కేటాయించి నేరుగా కొనుగోలుదారులతో మమేకం అయ్యేందుకు ఈ దుకాణాలు దోహదపడతాయనేది అప్పటి పాలకుల ఆలోచన. దుకాణాల కేటాయింపులో ఆదిలోనే హంసపాదు అన్నట్లు అనర్హులకు కేటాయించారని ఆరోపణలు వచ్చాయి. అది నిజమని తేలటంతో అలా కేటాయించిన ఓ దుకాణం లీజును అ ధికారులు రద్దుచేశారు. ఆ తరువాత  కొంతకాలం దుకాణాలను నిర్వాహకులు సక్రమంగానే నిర్వహించారు. 

నేతబజారుకు కూతవేటు దూరంలో ఎం జీసీ మార్కెట్‌, ఆర్‌ఆర్‌రోడ్డు, కామధేను కాం ప్లెక్స్‌ తదితర ప్రాంతాల్లోని వస్త్ర దుకాణాల దెబ్బకు నేత బజారులో వ్యాపారాలు పోటీపడలేపోయాయి. దీంతో దుకాణాల్లో కొన్ని ఖా ళీగా అయ్యాయి. ప్రస్తుతం నేతబజారు పైఅంతస్థులో ఉన్న పలు గదులను ఏడీ కార్యాలయం కింద ఉపయోగిస్తున్నారు.   చేనేత రంగాన్ని ఆదుకునేందుకు ప్రభు త్వం నుంచి ప్రోత్సాహకాలు అందించాల్సి ఉంది. తద్వా రా సంఘాలు బలోపేతం కావడంతోపాటు నేత బజారులోని దుకాణాలన్నీ అర్హులతో నిండిపోతాయి. సంబంధిత అధికారులు స్పందించి ఆ విధంగా చర్యలు చేపట్టాలని చేనేత రంగ ప్రతినిధులు కోరుతున్నారు.

Updated Date - 2022-01-21T05:04:16+05:30 IST