Advertisement
Advertisement
Abn logo
Advertisement

తల్లిదండ్రులు ఇష్టం లేని వరుడిని ఎంపిక చేశారని...వధువైన nurse ఏం చేసిందంటే...షాకింగ్

అహ్మదాబాద్ (గుజరాత్): సాక్షాత్తూ తల్లిదండ్రులే తనకు ఇష్టం లేని వరుడిని ఎంపిక చేశారనే ఆవేదనతో వధువు అయిన 22 ఏళ్ల నర్సు దారుణానికి పాల్పడిన షాకింగ్ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని భావ్‌నగర్‌లో జరిగింది.భావ్‌నగర్ ఆనందనగర్ ప్రాంతంలోని రోహిదాస్ వాస్ నివాసి అయిన అమీ మక్వానా (22) సర్ తఖ్తసింజి జనరల్ హాస్పిటల్‌లో నర్సుగా పనిచేసేది. అమీ మక్వానా నెలన్నర క్రితమే ఆసుపత్రిలో కాంట్రాక్టు నర్సుగా చేరింది. తల్లిదండ్రులు తనకు ఇష్టం లేని యువకుడిని వరుడిగా ఎంపిక చేశారని తీవ్ర ఆవేదన చెందిన నర్సు వివాహాన్ని నిరసిస్తూ ఆసుపత్రిలో ఆత్మహత్య చేసుకుంది. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ మక్వానా హాస్పిటల్ భవనం ఏడవ అంతస్తులోని స్టోర్ రూమ్ లో సీలింగ్ ఫ్యాన్ కు తాడుతో ఉరి వేసుకున్నపోలీసులు గుర్తించారు.

స్టోర్‌రూమ్‌ను ఆసుపత్రి సభ్యులు స్టాఫ్‌రూమ్‌గా కూడా ఉపయోగిస్తున్నారు. లోపల వాష్‌రూమ్ కూడా ఉంది.డ్యూటీకి వచ్చిన నర్సు మక్వానా స్టాఫ్ రూంకు వెళ్లి లోపల నుంచి బోల్టు వేసుకొని, ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు వచ్చి అద్దాలు పగులగొట్టి చూడగా నర్సు మృతదేహం వేలాడుతూ కనిపించిందని పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ హలాసింగ్ చెప్పారు.మక్వానా రాసిన సూసైడ్ నోట్‌ను స్టోర్‌రూమ్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 


‘‘నా తల్లిదండ్రులు సరైన యువకుడిని వివాహం చేసుకోవడానికి ఎంపిక చేయలేదని, అందువల్ల, తాను జీవితాన్ని అంతం చేసుకుంటున్నాను’’అని  రెండు పేజీల సూసైడ్ నోట్‌లో నర్సు మక్వానా పేర్కొంది.కాగా తన కుమార్తె మక్వానా ప్రభుత్వ నియామక పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయినందున ఆమె బాధపడుతోందని మృతురాలి కుటుంబ సభ్యులు చెప్పారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement