గుర్తు తెలియని మహిళ మృతదేహం...

ABN , First Publish Date - 2020-05-28T21:25:37+05:30 IST

హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ సమీపంలోని అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోల్నాక లోని సెంట్ అంబర్ స్కూల్‌లో గుర్తుతెలియని మహిళా (50) మృతదేహం లభ్యమైంది.

గుర్తు తెలియని మహిళ మృతదేహం...

అంబర్‌పేట్ : హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ సమీపంలోని అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోల్నాక లోని సెంట్ అంబర్ స్కూల్‌లో గుర్తుతెలియని మహిళా (50) మృతదేహం లభ్యమైంది. 


స్కూల్ గేట్లకు బయట నుండి తాళాలు వేసి ఉన్నప్పటికీ కూడా లోపల మృతదేహం ఉండటంతో పలు అనుమానాలు  వ్యక్తమవుతున్నాయి. కుళ్ళిపోయి వాసన వస్తుండడంతో పోలీసులకు స్థానికులు సమాచారమిచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం కూడా ఆధారాలు సేకరిస్తోంది. 

Updated Date - 2020-05-28T21:25:37+05:30 IST