Abn logo
Jan 14 2021 @ 18:24PM

కళ్యాణదుర్గంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం

అనంతపురం: జిల్లాలోని కళ్యాణదుర్గం అటవీప్రాంతంలో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం రేపింది. గొర్రెల కాపరులు ఈ మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి పోలీసులు వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది. ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేదా హత్యకు గల కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement