తగ్గని వైరస్‌ వేగం

ABN , First Publish Date - 2020-08-13T10:36:22+05:30 IST

ఉమ్మడి పాలమూరులో కరోనా వైరస్‌ వేగం తగ్గడం లేదు. ప్రతి రోజూ వందలాది మంది కొవిడ్‌-19 బారిన పడ్తూనే

తగ్గని వైరస్‌ వేగం

ఉమ్మడి పాలమూరులో కొత్తగా 298 కేసులు

జోగుళాంబ గద్వాల జిల్లాలోనే 106 మంది బాధితులు


మహబూబ్‌నగర్‌ (వైద్య విభాగం)/ జడ్చర్ల/ గద్వాల క్రైం/ నారాయణపేట క్రైం/ వన పర్తి/ వీపనగండ్ల/ నాగర్‌క ర్నూల్‌, ఆగస్టు 12: ఉమ్మడి పాలమూరులో కరోనా వైరస్‌ వేగం తగ్గడం లేదు. ప్రతి రోజూ వందలాది మంది కొవిడ్‌-19 బారిన పడ్తూనే ఉన్నారు. తాజాగా బుధవారం 298 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. అందులో ఒక్క జోగుళాంబ గద్వాల జిల్లాలోనే 106 మంది బాధితులు న్నారు. 


మహబూబ్‌నగర్‌ జిల్లాలో బుధవారం 64 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. వారిలో జిల్లా కేంద్రంలోనే 44 మందికి వైరస్‌ సోకింది. పట్టణంలోని సుభాష్‌నగర్‌లో ఒకే ఇంట్లో ఐదుగురికి, హనుమాన్‌పురలో ఒకే ఇంట్లో ముగ్గురికి పాజిటివ్‌ వచ్చింది. జడ్చర్ల పట్టణంలో ఆరుగురికి, బాదేపల్లిలో నలుగురికి కరోనా సోకింది. కోయిల్‌కొండ మండలం పారుపల్లిలో ఒకరికి, బాలానగర్‌ మండలం మునిగుట్టతండాలో ఒకరికి, ఉడిత్యాలలో ఒకరికి, సీసీ కుంట మండలం నెల్లికొండలో ఒకరికి, రాజాపూర్‌ మండలం రాఘవాపురంలో ఒకరికి వైరస్‌ నిర్ధారణ అయ్యింది. అడ్డాకుల మండలం శాగాపూర్‌లో ఒకటి, దేవరకద్ర మండలం పుటాన్‌పల్లిలో ఒకటి, నాగారంలో ఒకటి, భూత్పూర్‌ మండలం అన్నసాగర్‌లో ఒకటి కేసులు నమోదయ్యాయి. 


వనపర్తి జిల్లాలో 57 కేసులు నమోదయ్యాయి. అందులో వనపర్తి మండలంలో 30, అమరచింతలో ఐదు, ఆత్మకూరులో మూడు, గణపూర్‌లో ఐదు, గోపాల్‌పేటలో మూడు పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. కొత్తకోటలో ఒకరికి, మదనాపూర్‌లో ఇద్దరికి, పెబ్బేరులో ఇద్దరికి, పానగల్లులో ముగ్గురికి, పెద్దమందడిలో ఒకరికి, వీపనగండ్లలో ఇద్దరికి వైరస్‌ సోకింది. 


జోగుళాంబ గద్వాల జిల్లాలో బుధవారం 106 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో గద్వాల పట్టణంలోని ర్యాపిడ్‌, కోవిడ్‌ ల్యాబ్‌లలో 18 కేసులు నమోదు కాగా గద్వాల పట్టణంలోనే 7 కేసులు నమోదు అయ్యాయి. వీటితో పాటు చాగాపురంలో ఒకటి, సంగాలలో ఒకటి, వీరాపురంలో ఒకటి, పాల్వాయిలో ఒకటి, కే.టి.దొడ్డిలో ఒకటి, ఆర్‌. గార్లపాడులో ఒకటి, పెద్దపల్లిలో ఒకటి, అయిజలో మూడు, అలంపూర్‌లో ఒకటి  కరోనా కేసులు నమోదు అయ్యాయి. అలాగే జిల్లాలోని ఉప్పేరులో తొమ్మిది, ధరూర్‌లో ఐదు, గట్టులో నాలుగు, మల్ధకల్‌లో మూడు, ఇటిక్యాలలో ఆరు, క్యాతూరులో మూడు, మానోపాడులో ఐదు, అయిజలో 18, వడ్డెపల్లిలో ఏడు, రాజోలీలో ఏడు, అలంపూర్‌లో 21 కరోనా కేసులు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.


నారాయణపేట జిల్లా వ్యాప్తంగా బుదవారం 15 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జిల్లాకేంద్రంలోని ఎస్పీ కార్యాలయానికి సంబందించి ఇద్దరికి, దూల్‌పేట, అశోక్‌నగర్‌, అభంగాపూర్‌ గ్రామంలో ఒకరికి చొప్పున కరోనా బారిన పడ్డారు. ధన్వాడ మండలం కంసాన్‌పల్లిలో ఒకరికి, మద్దూర్‌లో ఇద్దరికి, కోస్గి, దామరగిద్ద, ఉడ్మల్‌గిద్ద, పెద్దజెట్రం, పగిడిమర్రి, కొల్లూరు, నర్వలో ఒక్కోక్కరికి పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. 


నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 56 మందికి వైరస్‌ సోకింది. అందులో జిల్లా కేంద్రంలోనే 16 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. తెలకపల్లి మం డలంలో 10 మంది, అచ్చంపేటలో తొమ్మిది మంది, అమ్రాబాద్‌లో ముగ్గురు, ఊర్కొండలో ముగ్గురు కరోనా బారిన పడగా, మిగతా మండలాల్లో ఒకరు, ఇద్దరు చొప్పున వైరస్‌ నిర్ధారణ అయ్యింది. 

Updated Date - 2020-08-13T10:36:22+05:30 IST