దేశంలోనే అతిపెద్ద ఐదవ బ్యాంకుగా యూనియన్‌ బ్యాంక్‌

ABN , First Publish Date - 2020-03-30T16:29:48+05:30 IST

ఈ బ్యాంకు దేశంలోనే అతిపెద్ద ఐదవ ప్రభుత్వరంగ బ్యాంకుగా చోటు సంపాదించింది.

దేశంలోనే అతిపెద్ద ఐదవ బ్యాంకుగా యూనియన్‌ బ్యాంక్‌

బెంగళూరు : ఆంధ్రాబ్యాంకు, కార్పొరేషన్‌ బ్యాంకులు యూనియన్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియాలో విలీనం కావడంతో ఈ బ్యాంకు దేశంలోనే అతిపెద్ద ఐదవ ప్రభుత్వరంగ బ్యాంకుగా చోటు సంపాదించింది. ఇందులో యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 1919లో ప్రారంభం కాగా ఆంధ్రాబ్యాంకు 1923లోనూ, కార్పొరేషన్‌ బ్యాంకు 1906లోనూ ప్రారంభమయ్యాయి. ఈ


మూడు బ్యాంకులు వేటికవే ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో విలీనం కావడంతో దేశంలో బ్యాంకు సేవలు మరింత విస్తారం కానున్నాయని యూనియన్‌ బ్యాంకు పేర్కొంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో రిజర్వుబ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జారీ చేసిన మార్గదర్శక సూ త్రాలను అమలు చేయడం ద్వారా ఖాతాదారులకు వెన్నుద న్నుగా ఉంటామని ప్రకటించింది. 

Updated Date - 2020-03-30T16:29:48+05:30 IST