పీఎం-పోషణ్ స్కీమ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం

ABN , First Publish Date - 2021-09-29T21:24:22+05:30 IST

పీఎం-పోషణ్ పథకాన్ని అమలు చేసేందుకు కేంద్ర

పీఎం-పోషణ్ స్కీమ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం

న్యూఢిల్లీ : పీఎం-పోషణ్ పథకాన్ని అమలు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం క్రింద దేశవ్యాప్తంగా దాదాపు 11.2 లక్షల ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తారు. ఈ పథకాన్ని ఐదు సంవత్సరాలపాటు అమలు చేస్తారు. దీని కోసం రూ.1.31 లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఈ వివరాలను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం మీడియాకు తెలిపారు. 


రూ.1,095.88 కోట్ల అంచనా వ్యయంతో నీమచ్-రాట్లం రైల్వే లైన్ డబులింగ్‌కు కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని అనురాగ్ చెప్పారు. రూ.1,080.58 కోట్ల అంచనా వ్యయంతో రాజ్‌కోట్-కనలుస్ రైల్వే లైన్ డబులింగ్ పనులకు కూడా ఆమోదం లభించిందన్నారు. 


ఎగుమతిదారులకు, బ్యాంకులకు సహకారం అందజేయడం కోసం ఐదేళ్ళలో ఈసీజీసీ లిమిటెడ్‌లో రూ.4,400 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు కేబినెట్ అనుమతించిందన్నారు. దీనివల్ల ఫార్మల్ సెక్టర్‌లో 2.6 లక్షల కొత్త ఉద్యోగాలతో సహా మొత్తం మీద 59 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయన్నారు. 


Updated Date - 2021-09-29T21:24:22+05:30 IST